Can't see Telugu? Learn here. More Questions? Ask here.

TMAD, ఎర్రకోట, నవీన్, గడి

సంపాదకీయం పొద్దు
(గమనికః పొద్దులో ఈనెలలోను, కిందటి నెలలోను వచ్చిన రచనల కోసం పేజీ అడుగున చూడండిః) చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు…… ఏమిటో ఈ నెల అతిథి ఉప్పలపాటి ప్రశాంతి వివరిస్తున్నారు. వి.బి.సౌమ్య అంపశయ్య నవీన్ రచనల గురించి “నేను చదివిన నవీన్” వ్యాసంలో వివరిస్తున్నారు. గడి శీర్షికలో ప్రొఫెసర్ గారు [...]
పూర్తిగా చదవండి

నేను చదివిన నవీన్

వి.బి.సౌమ్య, వ్యాసాలు పొద్దు
-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com) ఆధునిక తెలుగు సాహిత్యం లో నవీన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ” అంపశయ్య ” తో మొదలై ఇప్పటికీ సాగుతూ నవల , కథ , విమర్శ ఇలా వేర్వేరు పాయలు గా చీలినా ఒకటే అంతరాత్మ తో ఇంకా గలగలమంటూ ప్రవహిస్తున్న నది నవీన్. నేను సాహిత్యం, అందునా తెలుగులో, చదివింది తక్కువ. కానీ చదివినంత [...]
పూర్తిగా చదవండి

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

అతిథి పొద్దు
-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net) చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……ఏమిటో ఆమె మాటల్లోనే: నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని [...]
పూర్తిగా చదవండి

ఎర్రకోట

వ్యాసాలు పొద్దు
“భూమ్మీద స్వర్గమంటూ ఉంటే అది ఇక్కడే అది ఇక్కడే అది ఇక్కడే!!!” “If there is Heaven on the Earth, It is this, It is this, It is this” “అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్, హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.” అని అమీర్ ఖుస్రో పరవశించి పాడే నాటికి మొఘలులు భారతదేశంలోకి ఇంకా రాలేదు. ఎర్రకోట లాంటి బృహత్తర నిర్మాణమొకటి ఇక్కడ వెలుస్తుందని ఎవరూ ఊహించనైనా లేదు. ఐనా ఎర్రకోటలో షాజహాన్ ఆంతరంగిక [...]
పూర్తిగా చదవండి

జూన్ గడి సమాధానాలు

గడి పొద్దు
-సత్యసాయి కొవ్వలి (http://satyasodhana.blogspot.com) మా మాటః ఈసారి గడికి అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి నుంచి గడిని పూరిస్తున్నవారే కాకుండా ఈసారి కొత్తపాఠకులు కూడా ఎక్కువ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషించదగ్గ పరిణామం. ఇది గడికి ఆదరణ క్రమంగా పెరుగుతోందనడానికి నిదర్శనం. ఐతే కొత్త పాఠకుల గురించి వారి పేర్లు, ఈమెయిళ్ళు తప్ప ఇతర వివరాలు తెలియకపోవడం వెలితిగానే ఉంది. వారికి సంబంధించిన వెబ్సైట్లు గానీ, బ్లాగులు గానీ ఉన్నట్లైతే వాటి URLs ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఆల్ కరెక్టు సమాధానాలు పంపినవారుః సిముర్గ్, బి. [...]
పూర్తిగా చదవండి

చెర కవిత్వం - విప్లవ చైతన్యం

వ్యాసాలు ప్రజాకళ
- జె.సి. అదనపు విలువ దోపిడీని నిరంతరంగా కొనసాగించడానికి అనువుగా వర్గ సమాజం సృష్టించిన మార్మికత (mystification) ను సరుకులమాయ (commodity ferishism) ను అధిగమించి కవిత్వాన్ని తిరిగి నిజమైన విప్లవాచరణగా మార్చిన కొద్దిమంది కవుల్లో చెరబండరాజు అగ్రగణ్యుడు. దిగంబరకవిగా మొదలయి విప్లవ కవిగా ఆయనలో వచ్చిన మార్పు క్రమం విప్లవ గతితర్కానికి అనుగుణమైంది. ఈ మార్పు చెరబండరాజు విప్లవ కవుల్లో అగ్రగణ్యుడు కావడానికి ఎలా తోడ్పడిందో ఈ వ్యాసంలో చర్చిద్దాం. సామాజిక చైతన్యరూపమైన కవిత్వం గతి [...]
పూర్తిగా చదవండి

ఈతరానికి చెరబండరాజు చిరునామా!

కవితలు ప్రజాకళ
వందేమాతరం ఓ నా ప్రియమైన మాతృదేశమా తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలంనీది అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందంనీది సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకంనీది కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలకల్ని పందికొక్కుల్ని భరిస్తూ నుంచున్న ‘భారతి’వమ్మా నోటికందని సస్యశామల సీమవమ్మా వందేమాతరం వందేమాతరం ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ [...]
పూర్తిగా చదవండి

నీ మృత్యువుతో - సర్వేశ్వర్‌ దయాల్‌ సక్సేనా

కవితలు ప్రజాకళ
నీ మృత్యువుతో ఈ వర్షం లావాయై పొరలింది చైతన్య దిక్కుల నుంచి గంధకధూమం ఎగిసింది నలుదిక్కులా ఉక్కును ముక్కలు చేసిన వాసన కమ్మింది కనిపించనివి ఏఏ మసకమసక విధ్వంసన దృశ్యాలో జైలు కటకటాలా సంకెళ్లా మనస్సు నావరించిన భీరత్వపు గొలుసులా నోటికీ, కలానికీ పడ్డ తాళాలా లేదా అన్నీ ఒక్కసారేనానాకో చీకటికొట్టు కనిపిస్తున్నది దాని ఉక్కగోడల మీద బొట్లు బొట్లుగా కారిన నీ నెత్తురు చేసిన రంధ్రాలనుంచి కిలకిలలాడే పక్షుల స్వేచ్ఛా తరంగాల్లో పుష్పిస్తున్న సమస్త ఆకాశం తొంగిచూస్తున్నది ఒక విప్లవకారుని మరణంలో ఎందరు మృతులు సజీవులవుతారో ఎవరికి తెలుసు అచేతన సమాజం లేచినిలుస్తుంది అతని నరాల్లో నెత్తురాగితే కోట్లాది రక్తనాళాల్లో ఆగిన నెత్తురూ ప్రవాహమౌతుంది నా ముందు [...]
పూర్తిగా చదవండి

నెత్తుటి కళ్ళలో ఎత్తిన జెండా

వ్యాసాలు ప్రజాకళ
- శ్యామల చెర గురించి నన్ను రెండు మాటలు మాట్లాడమన్నారు. ఏం మాట్లాడను. మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది. బాధగా ఉంది. ఆయన రాసిన కవిత్వం, పాటలు చాలా సహజంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో, ముఖ్యంగా కష్టజీవుల గురించి, కార్మికుల గురించి రాసేవాడు. తాను ఎప్పుడూ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్లో ఉన్నా, బయట వున్నా, బస్సులో వున్నా, సైకిలు మీదున్నా, ఎక్కడ వున్నా కూడ ఆయనకు అదే ఆలోచన. అట్లా ఆలోచిస్తూ, [...]
పూర్తిగా చదవండి

ప్రపంచం నిండా ….

కవితలు ప్రజాకళ
- చెరబండరాజు ఆకాశం కింద విశాల హృదయంతో వస్త్ర హీన దేహాలతో మండే కడుపులతో రక్తాన్ని ఇంధనంగా మార్చి పాలకుల రైలు ఇంజన్ని ఊడ్చుకుపోతున్న కార్మికులం కర్షకులం నిరుపేదలం మనమే స్నేహానికీ ప్రేమకూ చేతులందిస్తే రోగాలూ నొప్పులూ ఆప్తులతో గోడుగోడునా చెప్పుకుంటే మనిషికి మనిషేగా తోడు నీడా అంటే పోరాటం మినహా బతుకూ భవిష్యత్తూ అసలే లేదంటే కంఠాల నిండా ఇనపముళ్ళు కుక్కే చట్టం కంటి రెప్ప లెత్తితే కాల్చేస్తామంటోంది కడలి తప్ప కన్నీటిని బోధపర్చుకునే దెవరు కడుపు బాధలకు నేల తప్ప కరుణా ప్రేమలతో చెవియొగ్గే దెవరు ప్రపంచం నిండా మన చేతుల్లో ఆకలి ఆక్రందన [...]
పూర్తిగా చదవండి

ప్రజాకవి చెరబండరాజు సాహిత్యం

సంపాదకీయం ప్రజాకళ
రాజులను పొగిడి, దేవుళ్ళను కీర్తించి భరణాలను పొందిన కవులున్నారు. ప్రభుత్వాలను మెప్పించి అవార్డులు గెలిచిన రచయితలున్నారు. కానీ జనం గుండెల్లో బాధను అర్థం చేసుకొని, అన్యాయంపైన పోరాడి, ప్రజలకు ఒక విప్లవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించిన కవులు కొందరే. విప్లవకవి చెరబండరాజు వారిలో ఒకరు. ప్రజాకవి చెరబండరాజు సంస్మరణలో భాగంగా, 25 వ వర్థంతి సందర్భంగా, ప్రజాకళ ఆయన రాసిన కొన్ని రచనలను ప్రచురించింది. ముఖ్యంగా చెర ప్రసిద్ధిగాంచిన “వందేమాతరం” కవిత రాసారు. “ఓ నా ప్రియమైన [...]
పూర్తిగా చదవండి

కత్తిపాట

పాటలు ప్రజాకళ
- చెరబండరాజు మృత్యువునే పరిహసిస్తు శత్రువునూ ఎదిరిస్తా బాహాబాహి యుద్ధంలో ప్రజాబలం నిరూపిస్తా పాలకులా ప్రతిపక్షుల ఉభయవర్గ శత్రువునే సమీకృత సాయుధవ్యవస్థను ప్రజాయుద్ధమే జయించు ప్రతిపక్షం సీటుగాదు రాజ్యాంగం వలయునాకు అనారోగ్య బాధితుణ్ణే అయితేనేం యోధుణ్ణే కలంగళం ప్రాణప్రదం ప్రజకి నేను అంకితం పోరాటం డైరెక్షన్ పాట నాకు ఆక్సిజన్ కన్నీటికి కరుగుతాను ఏటివాలు పడిపోను ముంజేతిని ఖండించిన నా పిడికిటి కత్తివదల ఉరి తాటికి పాట నేర్పి పల్లవినే పాడిస్తా ప్రజలు వేలు మృతులైనా పోరాటం జయిస్తుంది రేపటిపై ఆశలున్న వాడేనోయ్ మానవుడు ఈ చీకటి కుంపటారి ప్రభాతాలు పరిమళించు
పూర్తిగా చదవండి

రైట్ టు ఓట్ కాదు

కవితలు ప్రజాకళ
- లోచన్ కోట్ల అస్థిపంజరాలమీద మస్తీగా కొందరు రక్తపు గిలాస లెగరేస్తూ ఆకలి సముద్రంలో మమ్మల్ని తన్నేస్తూ – ఆకాశాని కెత్తిన పెట్టుబడి- వేయిపగడలు మా బతుకుల్లో విషం కక్కుతుంటే మూడు కోతులూ బోడినవ్వులూ జాతిని నిర్వీర్యం చేసేస్తే ఇంకా వ్యక్తి స్వేచ్ఛ అనే వెర్రి భ్రమలో వర్గసామరస్యం పన్నిన వలలో గిలగిలా తన్నుకోలేను భాక్రానంగల్లూ నాగార్జునసాగర్లూ ’గొప్పోళ్ళ’ షవర్ బాత్ రూముల్లో ఊడిగాలు చేస్తోంటే ఈ జాతీయ వంచకుల బద్మాష్ డ్రామాలో ఫూల్ గా నటించలేను ఈ కొండమంగలి వెధవల చేతుల్లో నిస్సహాయంగా తల ఉంచలేను ఇరవైమూడేళ్ళ భయానక చరిత్ర రాష్ డ్రైవింగ్ లో [...]
పూర్తిగా చదవండి

అతనికేం కావాలి?

కవితలు ప్రజాకళ
- రామా చంద్రమౌళి ఒక పేరు కోసం, ఒక ఉనికి కోసమేకదా ఎవరైనా, ఏదైనా చేస్తున్నది అతనికసలు పేరేలేదు అన్నీ ‘అలియాస్’ లే - ఆ రోజు అన్నింటినీ పరిత్యజించి, అందరినీ త్యాగించి గమ్యం తెలియని గౌతమునివలె కాక స్పష్టమైన ‘లక్ష్యం’ తోనే అడవిలోకి అంతర్ధానమైనవాడు – గాజుపెంకుల దారిలోనే బోసిపాదాలతో నడవాలని నిర్దారించుకుని రాతిపాదాలను సమకూర్చుకున్నవాడు ఏ పశువులకొట్టంలో పడుకున్నాడో ఏ పొదలమాటున పిడికెడు తిన్నాడో పుస్తకాలను నమ్మి, పాటలను నమ్మి బిగించిన పిడికిళ్ళను నమ్మి గర్జనలను నమ్మి … ఒక అదృశ్య సైనికుడై తనకంటూ ఓ జీవితం లేకుండా బతుకంతా ఒక రహస్యమే ఐనవాడు భూమికి [...]
పూర్తిగా చదవండి

మాట్లాడుకోవాలి

కవితలు ప్రజాకళ
- డా. బి.వి.ఆర్. ప్రసాదమూర్తి మాట్లాడుకోవాలి మెత్తగా బత్తాయి పండు తొనలువిప్పినట్టు మనసువిప్పి మాట్లాడుకోవాలి గుండెలోపలికి చేతులుపెట్టి బయటకుతీసిన మాటల్ని షవర్ బాత్ చేయించి ప్రెష్గా ఎదుటివాళ్ళముందుంచాలి మాటలేకదా అమ్మ నాన్న గురువు సంఘం వీళ్ళంతా నీళ్ళుపోసి పెంచిన మాటలేకదా అంతా చేయిపట్టుకునిలబెట్టిన మాటలే కదా మాట్లాడితే అందరికీ కృతజ్ఞతతో అభివాదం చేస్తున్నట్టుండాలి అప్పుడే స్నానమాడిన రెండు తడిదేహాలు తమకంగా కౌగిలించుకున్నట్టుండాలి మాట్లాడితే శుభ్రంగా మంచుకడిగిన నిలువెత్తు అరిటాకు మీద ఆత్మీయులకోసం నిన్ను నువ్వు వొడ్డించుకున్నట్టుండాలి మాటకు బొమ్మేకాని బొరుసులేదు మాటకు వెలుగేకాని చీకటిలేదు మనుషుల్లా మాట్లాడుకోవాలి అందరిముందు నిన్ను నువ్వు గుమ్మరించేసుకొని శున్యంగా చిద్విలాసించాలి తొదుగుల్లేని మాటల్ని జేబుల్నినింపుకొని గృహదేహాల నుండి బయటపడాలి ఇంట్లోనైనా వీధిలోనైనా ఆఫీసులోనైనా పార్లమెంటులోనైనా ఫ్రేమకోసం స్నేహంకోసం శాంతికోసం మాట్ట్లాడుకోవాలి పంజరంలోనుండి పక్షిని [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS