మొన్నో రోజు దీని గురించి ఓ వ్యాసం లో ఓ వాక్యం చెప్పాను కానీ … ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. మళ్ళీ ఈ సారి దీని పైనే ఓ టపా తో మీ ముందుకి వస్తున్నా. ఫెడోరా 6 లో ఉన్న SCIM telugu keyboard లో మనకు రెండు టైపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ITrans, ఒకటేమో inscript. దీని వల్ల మీ లినక్స్ Desktop పై ఎక్కడైనా ఏ utility లో అన్నా తెలుగు లో టైపు చేయవచ్చు. 56 తెలుగు అక్షరాల్లో 54 అక్షరాలను నేను టైపు చేసాను. మిగిలిన రెండూ - మూడో చ, మూడో జ. అవి రెండూ యూనీకోడు లోనే లేవు లా ఉన్నాయి. యూనీకోడు చార్టు లో కనబళ్ళేదు. ఇక నాలో inscript అన్న పదం పై కూడా ఆసక్తి పోయింది. ITrans RTS కి చాలా దగ్గరగా ఉంటుంది. కావున, నేనో కొత్త లేఅవుట్ నేర్చుకుని తంటాలు పడనక్కరలేదు.

Intuitive గా RTS-ITRANS - ఇవే inscript కంటే కరెక్టు గా అనిపిస్తాయి నాకు. ఇదే ఓ సారి - “మీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ లే అవుట్ ఏమిటి అలా ఉంది?” ఓ మైక్రోసాఫ్ట్ ఆయనతో అంటే - నిజమే… ఆ లేఅవుట్ కంటే RTS మనిషి intuition కి దగ్గర్లో ఉంటుంది అని అన్నారు. ఫెడోరా 5 లో కూడా కీబోర్డులు ఉన్నవి కానీ, తెలుగు లేదనుకుంటా. ఏమైనా, నాకు ఆనందంగా ఉంది ఇది చూసాక. విండోస్ కి బై-బై చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. చెప్పేసే ప్రయత్నం లో ఈ మధ్యే కొన్ని మెట్లు ఎక్కడం మొదలైంది. ఇది మరో మెట్టు. మీరెవరన్నా ఫెడోరా ఉపయోగిస్తూ ఉంటే ప్రయత్నించండి. ఏవో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా సమస్యలేమీ లేదు ఇందులో. కానీ, అవి చెప్పుకోదగ్గ సమస్యలేమీ కావు. నాకు ఐతే దీనితో ఉన్న ఏకైక సమస్య - టాగుల్ కి కీ ఉందో లేదో తెలీకపోవడం.

ఇందులో ఇంకా ఉన్న భాషలు - Arabic, Assamese, Bengali, Gujarathi, Hebrew, Hindi, Kannada, Malayalam, Marathi, Oriya, Punjabi, Simhala, Tamil, Telugu, Urdu, Chinese (రకరకాల encodings) వగైరా.

తెలుగు అక్షరాలన్నీ టైపు చేసిన screenshot కూడా పెడుతున్నా.



పూర్తిగా చదవండి