ఉత్తమా యిల్లాలి నోయీ!
నన్నుసురు పెడితే దోస మోయీ!

నిదరలో నిను సూసి సెదిరే నేమో మనసు!
పొరుగు పోరంత నా సరస కురికారంట!
ఉత్తమ యిల్లాలి నోయీ………

“ఏలనే నవ్వం”ట! “ఏడుపేలే ” యంట
పదిమంది ఆయింత పగలబడి నారంట
ఉత్తమ యిల్లాలి నోయీ………

గాలెంట వోయమ్మ! దూళెంట వోయమ్మ!
యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట!
ఉత్తమా యిల్లాలి నోయీ……..

యీబూది ఒకతెట్టే! యీ పింకొకతె తట్టె,
నీలు సిలికె దొకతె! నిలిసి సూసే దొకతె!


పూర్తిగా చదవండి