పడవ
యెంకి పాటలు June 15th, 2007ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!
పాడలేనే యెంకి పదము లీ రొదలో!
పడవ సల్లగ నడిపి
పదము సదు వంటావు!
కస్సుమంటూ యేరు
గాలి నెగదోసింది!
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!
వోరుగాలే పాట
దారి కడతా వుంది !
బేటి కురికే పాట నోట
నోట గొడతా వుంది!
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!
తల మలుపుకొని పాట
తరలింది కామోసు!
దేముడల్లే లోనె
తిరుగుతున్నా దేటో!
ఆపలేనే యెంకి యీ పడవ యిసురు!
యెన్నెలంటే పాట
కెంత మనసవుతాదో
పాట సాగేతలికి
పయన
పూర్తిగా చదవండి