సాటేలా ? నీకు మాటేలా?
సిన్న తనమేలా? సిగ్గేలా?

ఆ సీమ యీ సీమ
అంద చందాలు
తిన్నంగ నిను సూసె
దిద్దుకుంటారు !

సాటేలా ? నీకు మాటేలా?
సిన్న తనమేలా? సిగ్గేలా?

ముందు మన పాపణ్ణి
కింద దిగనీరు
యెంకి కో వంటారు!
యెత్తుకుంటారు!

సాటేలా ? నీకు మాటేలా?
సిన్న తనమేలా? సిగ్గేలా?

యెంకొక్క దేవతై
యెలిసె నంటారు
యింటింట పెడతారు
యెంకి నీ పేరు!

సాటేలా ? నీకు మాటేలా?
సిన్న తనమేలా? సిగ్గేలా?

రచన : నండూరి సుబ్బారావు


పూర్తిగా చదవండి