ఎఱ్ఱి నా యెంకి
యెంకి పాటలు June 16th, 2007“యెనక జల్మములోన
యెవరమో” నంటి
సిగ్గొచ్చి నవ్వింది
సిలక…నా యెంకి!
“ముందు మనకే జల్మ
ముందోలే” యంటి
తెల్ల తెల్ల బోయింది
పిల్ల …నా యెంకి!
“యెన్నాళ్ళో మనకోలె
యీ సుకము” లంటి
కంట నీరెట్టింది
జంట …నా యెంకి!
రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి