Can't see Telugu? Learn here. More Questions? Ask here.

దూరాన నా యెంకి

యెంకి పాటలు June 16th, 2007

యాడుంటివే, యెంకి యాడుంటివే?
వూతోరి పందిట్లో
సీతాయి యెల్తుంటే

నీ తళుకు గేపగాన
నా తల తిరిగిందోలె!

యాడుంటివే,యెంకి యాడుంటివే?
మామిడితోట కెల్లి
మంచిపండోటి గోసి

యేటోగాని, నోట్లేస్తే
యిసమై పోయిందోలె!

యాడుంటివే, యెంకి యాడుంటివే?

పొత్తేళ్ళ జొన్న సేలో
సిత్తరమై పోతాది

గుమ్మమై వోసనొస్తే
గుండెగిరి పోయెనోలె!

యాడుంటివే, యెంకి యాడుంటివే?

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్


పూర్తిగా చదవండి

దూరాన నా యెంకి

Telugu June 16th, 2007

పూర్తిగా చదవండి