నమిలి మింగిన నా యెంకీ
యెంకి పాటలు June 16th, 2007యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
మెళ్ళో పూసల పేరు
తల్లో పూవుల సేరు
కళ్ళెత్తితే సాలు
కనకాబిసేకాలు
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
సెక్కిట సిన్నీ మచ్చ
సెపితే సాలదు లచ్చ!
వొక్క నవ్వే యేలు
వొజ్జిర మయిడూరాలు!
యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!
యెంకి నా వొంకింక రాదోయి రాదోయి!
పదమూ పాడిందంటె
పాపాలు పోవాల
కతలు సెప్పిందంటె
కలకాల ముండాల
పూర్తిగా చదవండి