” యీ రేతి రొక్క తేవు యే మొచ్చినావే?”
” ఆడు నే నిక్కడే ఆడినామమ్మ”

“యేటి నురగల కేసి యేటి సూసేవే?”
“మా వోడి మనసట్టె మరుగుతాదమ్మా!”

“సెంద్రవొంకలో యేమి సిత్రమున్నాదే?”
“వొంక పోగానే మా వోడొస్తాడమ్మా!”

“ఆడు నేనిక్కడే ఆడినామమ్మా!
మావోడి మనసట్టె మరుగుతాదమ్మా!
ఆ వొంక పోగానే ఆడొస్తాడమ్మా!”

రచన : నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్న బుక్ హౌస్


పూర్తిగా చదవండి