వర్గీకరణలో ప్రాంతీయ ప్రత్యేకత
Telugu, Vartamaanam June 18th, 2007షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఆ షెడ్యూల్డ్ కులాలలోనే కొన్ని వర్గాలు తమ జనాభా నిష్పత్తికన్న ఎక్కువగా వినియోగించుకుంటున్నందువల్ల, మరికొన్ని వర్గాలు తమ న్యాయమైన వాటాను పొందలేకపోతున్నాయనే వాదనతో, రిజర్వేషన్ల కల్పనలో షెడ్యూల్డ్ కులాల మధ్య కూడ వర్గీకరణను అమలు చేయాలని మొదలయిన మాదిగ దండోరా ఉద్యమం పదమూడు సంవత్సరాల కాలంలో అనేకమలుపులు తిరిగింది. మాదిగ దండోరా నాయకత్వం అప్పుడప్పుడు అవకాశవాద వైఖరి అవలంబించినా, పాలకవర్గ ముఠా తగాదాల్లో తెలిసో తెలియకనో భాగమయిపోయినా, ఆ ఉద్యమపు సారాంశం ఒక ప్రజాస్వామికమైన, న్యాయమైన డిమాండ్. (more…)
పూర్తిగా చదవండి