చాలా రోజులుగా ఎదురుచూసిన నా కల నిన్న నిజమైంది.

శనివారం రోజు ఇంట్లో నా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని మొదటి సారిగా డబ్బులు పెట్టి ఒక తెలుగు సినిమా చూసా! నా బ్లాగుని మొదటినుంచి ఫాలో అవుతున్న వాళ్ళకీపాటికే అర్థమయ్యివుంటుంది నేను చూసిన సినిమా ఏంటో.తెలుగు సినిమా ప్రపంచంలో కాసేపు సంచలనం సృష్టించిన అనీష్ కురువిలా సినిమా "నా వీడియో డైరీ" ,Confessions of a filmmaker సినిమా అనుకున్నట్టుగా 15వతేదీన ఇంటర్నెట్లో లభ్యం కాలేదు. ఏవో server సమస్యలు ఎదురయ్యి ప్రేక్షకలోకానికి ఒక రోజు లేటుగా సినిమా చూసే అవకాశం దొరికింది.
పూర్తిగా చదవండి