ప్రపంచ సంగీత దినోత్సవం
SP balu, aalaapana, bhanupriya, ilayaraja, mohan, veturi, world music day June 21st, 2007ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం . సంగీత ప్రియులందరికీ నా శుభాకాంక్షలు
ఈ సందర్భం గా ఒక రాగం…
***
ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాల
ఆవేశమంతా
నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ
సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప
సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస
అల పైటలేసే సెలపాట విన్న
గిరివీణ మీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
జర్దరతల నాట్యం అరవిరుల మరులకావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగే గానం
నిదురలేచె నాలో హౄదయమే
ఆవేశమంతా
సానీస పనీస నీసగమగనీ
సాసానిద దనిప గమప గమప గమప గమగసగమగమ నిసనిస గమగపదనిస
జలకన్యలాడే తొలి మాసమన్న
గోధూళి తెరలో మలిసంజ కన్న
అందాలు కరిగే ఆవేదన
నాదాల గుడిలో ఆరాధన
చిలిపి చినుకు చందం పురివిడిన నెమలిపించం
ఎదలు కలిపి నాలో విరిపొదలు వెతికె మోహం
బదులులేని ఏదో పిలుపులా
ఆవేశమంతా
***
చిత్రం : ఆలాపన (1984)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి (అనుకుంటున్నాను)
గానం : బాలు
పూర్తిగా చదవండి