Do u send ur child to study with HIV affected
నేనూ మడిసినే కదా June 28th, 2007కేరళ…
చక్కటి ప్రకృతి కి పేరెన్నికగల రాష్ట్రం
పచ్చన్ని పొలాలను నిత్యం తడిపే వర్షం తో నిత్యం అలరారే రాష్ట్రం
ప్రతి మదీ పులకించింప చేసే ప్రాంతం
అంతే కాక సంపూర్ణ అక్షరాస్యత సాదించి అందరికీ ఆదర్శప్రాయం గా నిలిచే రాష్ట్రం
అలాంటి రాష్ట్రం నేడు అందరి దృష్టీ ఆకర్షించిందీ
అదీ చాలా సున్నిత విషయం మై
“ఎయిడ్స్ బారిన పడిన 5 విద్యార్థులు గల పాఠశాలలో తమ పిల్లలను చదివించమని మిగితా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడి మానిపించడం”
ప్రతి రోజు ఏదో టీ వీ లో ఏకధాటిగా ఎయిడ్స్ మీద ,అది ఎలా వ్యాపిస్తుందో,ఎలా వ్యాపించదో చక్కాగా చెప్తునే ఉంటారు
అయినా ఎందుకీ వివక్షత……అదీ పసి పిల్లలపట్ల
వారికి నేర్పాల్సింది పోయి,పెద్దలే ఇలా
చట్ట ప్రకారం అందరికీ విద్య హక్కు ఉంది.
కానీ ఏ చట్టం ఈ తల్లిదండ్రుల మనసు మార్చగలదు
మార్చినా అది నిజమైనా మార్పా??
ఎయిడ్స్ గురించి ఇంత విస్త్రుత ప్రచారం జరుగుతున్నా మార్పు రావట్లేదు అంటే లోపం ఎక్కడ..
మన ప్రచార సాధనాలలోనా.??
“కౄర మృగ్గమ్ముల కోరలు పీకెను…..అయినా మనిషి మారలేదు..తనలోని మృగ్గాన్ని చంపలేదు” అన్న పాట తీరుగా ఉన్నాం
మన వివక్షత వ్యాధి మీదనా,వ్యాధిగ్రస్థ మీదనా???
ఈ కేరళ విషయం లో అంతిమ తీర్పు ఏది వచ్చినా…జరగాల్సిన నష్టం జరిపొయింది….
ఆ 5 చిన్నారుల మనసు గాయపడింది
ఏం చెప్పి ఆ హృదయాలను ఓదార్చగలం
తమ ప్రమేయం లేకుండా జరిగిన దానికి తాము బాధ్యత వహించడం ఎంత వరకు సబబు
అసలు తమ చుట్టు ఎమీ,ఎందుకు జరుగుతుందో కూడా వాళ్ళకు తెలియదు
కనీసం మిగితా అందరం ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూద్దాం
పూర్తిగా చదవండి