“నాకు విడాకులిస్తే, నా దారి నేను చూసుకుంటాను.”
పేపర్ చూస్తున్న రఘు ఉలిక్కిపడ్డాడు. ఎప్పట్లాగే అతనికి సరోజ మొహం చూడగానే జాలి, వాత్సల్యం కలిగాయి.
“ఇప్పుడు విడాకుల ప్రసక్తెందుకు?”
“నేను ఈ ఇంటినుంచీ, బాధ్యతల నించీ, బంధాలనుంచీ తప్పించుకోవాలనుకుంటున్నాను”
ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నాడు.
“దానికి విడాకులెందుకు, నువ్వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చుగా?”
“అవును. కాని విడాకులిస్తే, మీ భవిష్యత్తుకడ్డేమి ఉండదుగా?”
ఎంత ఎమోషనల్ క్రైసిస్‌లో కూడా నిజాయితీగా ఆలోచించే భార్యని చూసి గర్వపడ్డాడు. ఆమె విరక్తినీ, మానసిక స్థితినీ అర్థం చేసుకున్నాడు.
“చూడు. ఈ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం. నువ్వు కాసేపు [...]
పూర్తిగా చదవండి