గమనిక: ఈ పోస్ట్ సినిమాలగురించి కాదు. ఈ ఫోటోలో మీరు చూస్తున్నది పూనే సమీపంలోని సింహఘడ్ కోట ప్రవేశద్వారం (మరిన్ని చిత్రాలకై నా ఫోటోబ్లాగు చూడండి). ముష్కరమూకల దారుణాలని అడ్డుకుని భారతజాతికి ఆత్మగౌరవాన్ని గుర్తుచేసిన వీర శివాజీ అనుచరులు దుష్కరమైన పశ్చిమకనుమల ఇరుకు మార్గాలనుంచి ప్రయాణించి, ఉడుములని కోటగోడలెక్కించి, వాటిని పట్టుకు ఎక్కి, ఔరంగజేబు సైన్యాన్ని కకావికలం చేసిన అద్భుత సాహసకృత్యానికి నిలువెత్తు నిదర్శనం. అక్కడ కోటగోడలు చూసిన నాకు, వారి ధైర్యాన్ని, సాహసకృత్యాన్ని తలచుకుంటే వళ్ళు గగుర్పొడిచింది. గుండెధైర్యం అంటే [...]
పూర్తిగా చదవండి