నాగరాజు గారు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని విల్‌డ్యూరాంట్ రచించిన స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ తో పోలుస్తూ మంచి వ్యాసం రాశారు. ఆ వ్యాసం దగ్గర కొన్ని సాంకేతిక కారణాలవల్ల నా అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పలేక పోయాను. అక్కడ నేను చెప్పిన అభిప్రాయం ఇది.


"నాగరాజు గార్కి నమస్కారం!


మీ వ్యాసం అద్యంతమూ ఆసక్తి గా చదివాను. మంచి రీడబిలిటీ ఉంది. ఆరుద్ర గారి గురించి మీరు వ్యక్తంచేసిన చాలా అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నాలుగు సంపుటాల్లో కొన్ని పద్యాలు ,వాక్యాలు వంటివి తొలగించారు. నిజానికి ప్రజాశక్తి వాళ్ళు ప్రచురించిన పుస్త్కాలలో ఆరుద్ర అభిప్రాయాలు యధాతథంగా ఉన్నాయి. కాకపోతే అందులో కొన్ని హడావిడిగా రాసినవీ ఉన్నాయి. మరిన్ని అభిప్రాయాలను నా బ్లాగులో రాసున్నాను. ( సాంకేతిక కారణాలు ప్లీజ్ )


మీ


దార్ల "




ఆరుద్ర 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' తొలిముద్రణలో 12 సంపుటులుగాను, ద్వితీయముద్రణలో 13 సంపుటులుగానూ తెలుగు సాహిత్యాన్ని సాధ్యమైనంత సమగ్రంగా అందించారు. చాలా మంది తొలి ముద్రణనే ఆధారం చేసుకొని చాలా మంది 12, 14 అని Online లో రాస్తున్నారు. పెద్ద పెద్ద సాహితీ వేత్తలు కూడా ఇలాగే పొరపడుతున్నారు .
నిజానికి ఆరుద్ర 13 సంపుటులు రాశారు. మొదటి ప్రచురణ మాత్రం 12 సంపుటాలే! వెబ్ సైట్ల లో కూడా ఇదే ప్రచారంలో ఉంది. నాగరాజు పప్పు గారు " ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం '' పేరుతో ఒక మంచి వ్యాసం రాశారు. దీనిలోని ప్రతి వాక్యం స్పూర్తి దాయకంగా ఉంది. ఆరుద్ర పట్ల గౌరవం పెరిగేటట్లు ఉంది.అయితే ఆరుద్ర రచనలో కొన్ని లోపాలున్నాయి. వాటిని కూడా స్పర్శిస్తూనే మూల రచనను చదివించేటట్లు నాగరాజు గారు రాశారు. కానీ నాగరాజు గారు The Story of Civilization by Will and Ariel Durant లతో పోల్చి చెప్పడం, ఆ దేశంలో చరిత్ర కారులకిచ్చే గౌరవం ... ఇలా పోల్చి చెప్పటం బాగుంది. అయితే ఈ సందర్భం లో మనం ఒకటి గమ్నించాలి.మనతెలుగులో కవులు, చరితకారులు , విమర్శకులపై భావజాల ప్రభావం అధికంగా ఉంది . అది ఎలాంటిదైనా కావచ్చు. ఆరుద్ర మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్య చరిత్రను రాశారు. ఇదొక కారణంగా సమగ్ర ఆంధ్ర సాహిత్యాన్ని చాలా మంది రిఫర్ చేయడం లేదనుకుంటున్నాను . అకాడిమిక్ గా చదివే వారికి సమగ్ర ఆంధ్ర సాహిత్యం కంటే ఆచార్య జి.నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష సులువుగా ,స్పస్టంగా ఉంటుంది.
నా పరిశోధనను ఇంకా ( పరిశోధకుడుగా ఆరుద్ర " పేరుతో పిహెచ్. డి చేశాను) ప్రచురించలేదు. ఆ రాత ప్రతి డిజిటైజేన్‌ చేశామని లైబ్రరీ వాళ్ళు అంటున్నారు. కానీ వెబ్ లింక్ లో రావటం లేదు. ఈ విషయంలో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకొనేవారికి నా పుస్తకం కొంత ఉపయోగ పడవచ్చనుకుంటున్నాను.
ఏది ఏమైనా అంటే ఆరుద్ర గారు రాసినా మరొకరు రాసినా మూల రచనను చదివించే్టట్లు చేయగలగటం, ఒక ఆలోచనా స్రవంతిని కలిగించటమే ప్రధానంగా పరిశోధకుడైనా, విమర్శకుడైనా కలిగించగలగాలి.
Onlineలో రచయితలు చాలా వరకూ విజయం సాధించగలగుతున్నారు .



పూర్తిగా చదవండి