మొత్తానికి 'తానా' మహాసభలు రంజుగా సాగాయి. మన తోటి బ్లాగరులైన ప్రసాద్, విహారిల పుణ్యమా అని ఖచ్చితమైన సమాచారమే అందింది. కాకపోతే వారితో పాటు వెళ్లాల్సిన నేను అనుకోని కారణాల వల్ల వెళ్లలేకపోయాను. కానీ తెలుగు వాడిని అమెరికా గద్దెపై ప్రతిష్టించే కార్యక్రమానికి పునాదిరాళ్లు వేశారు కొందరు పెద్దలు. చిన్నవాడినైనా ఓ పెద్దమాట అంత వరకు వస్తే అక్కడా మన కులరాజకీయాల మకిలిని అంటించే ప్రయత్నం జరగదు కదా?

ఇది పక్కన పెడితే, 'సొంత ఇల్లు కూడా లేని బడుగు జీవి క్లింటన్' అంటూ మన వీధి రాజకీయనినాదాలను కూడా అంతర్జాతీయ స్థాయికి తెచ్చారు. నేనూ క్లింటన్ అభిమానినే అయినా ఆయన బడుగుజీవి మాత్రం కాదేమో? 'అట్టడుగువర్గాల ఆశాజ్యోతి' అన్నారు, తన ఫౌండేషన్ ద్వారా కొన్ని ఘనమైన ప్రయత్నాలు చేస్తున్నా ఆ 'అట్టడుగు వర్గాల' వారికి ఆయన గురించైనా తెలుసో లేదో!

ఇక మన బాబు గారి వంతు...ప్రవాస భారతీయులంటే...కేవలం అమెరికా వచ్చి చందాలు దండుకోవడమేనా లేక సౌదీ/దుబాయ్ లలో ఉన్న మన తెలుగు ప్రవాసుల వెతలు కాస్తయినా పట్టించుకొనేదుందా? బాబు గారు హైటెక్కు అంటూ ఆర్థిక సరళీకరణ ఫలితాలను పట్టణ మధ్యతరగతికి బాగానే అందించినా...పల్లెల్లో రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అదే ఆయన పార్టీ అథ:పతనానికి తొలి మెట్టు. ఇప్పటికైనా గ్రహించి రైతు వేషం వేస్తున్నారు కాబట్టి సరిపోయింది...కానీ నమ్మేవాళ్లు ఉండాలిగా!

'అనంత'లో జరిగిన ఎన్నో ఆత్మహత్యలకు సజీవసాక్ష్యం నేను. కొందరిని బ్రతికించినా చాలా మంది విషమపరిస్థితుల్లో రావడం వల్ల మరణించారు. ప్రభుత్వమిచ్చే డబ్బు కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్నారు అని అన్న ఘనుడీయన. ఇప్పుడు చెర్నాకోలు పట్టుకొని ఫోటోలకు ఫోజిచ్చినంత మాత్రాన పాత సంగతులు మరుగున పడవు. అదే మా 'అన్న' బ్రతికుంటే ఇలా జరగనిచ్చేనా! ఈ 'దశమగ్రహం' వల్ల ప్రధాని పదవి పోవడం (దారినపోయే దేవెగౌడకు ఇచ్చారు అప్పుడు) అటుంచి చివరకు ఆ మహానుభావుడి ప్రాణాలకే మోసం వచ్చింది. ఎవరెంత చెప్పినా మా 'ఎన్టీవోడి'ని మోసం చేసిన ఈయన్ని నేనెప్పటికీ క్షమించలేను. మళ్లీ ఇప్పుడు నిస్సిగ్గుగా ఆయన బొమ్మనే పెట్టుకొని ఓట్లు, నోట్లు అడుక్కొంటున్నారు!
పూర్తిగా చదవండి