పోలీసులదేనా రాజ్యం?
Telugu, Vartamaanam July 17th, 2007“ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, తుపాకి రాజ్యం” అనే నినాదం ఈ రాష్ట్రంలో మార్మోగడం 1970ల చివరలోనో 1980ల మొదట్లోనో ప్రారంభమయింది. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ ఎస్ యు), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) వంటి విప్లవ విద్యార్థిసంఘాల ద్వారా, మొత్తంగా నక్సలైటు రాజకీయాల ద్వారా ఆ నినాదం చలామణీలోకి వచ్చింది. అప్పుడు ప్రధానంగా ఈ నినాదం ఇస్తుండిన సంఘాలలో కొన్ని ఇప్పుడు నిషేధంలో ఉన్నాయి, కొన్ని అదృశ్యమయ్యాయి, కొన్ని కొనసాగుతున్నాయి. కాని పావుశతాబ్దం గడిచేసరికి అన్నిరాజకీయపక్షాలూ ఈ నక్సలైటు నినాదాన్ని తమ నినాదంగా చేసుకున్నట్టు కనబడుతున్నది. రెండున్నర దశాబ్దాలకింద నక్సలైట్లు చేసిన విశ్లేషణ నిజమేనని ఇవాళ అందరూ అంగీకరిస్తున్నట్టున్నది.
(more…)
పూర్తిగా చదవండి