మొదటి మహిళ
నేనూ మడిసినే కదా July 21st, 2007కొందరంటే తెలియని అభిమానం
వాళ్ళని ఎప్పుడూ కలిసి ఉండం
మాట్లాడి ఉండం
దగ్గరి నుంచీ చూసి కూడా ఉండం
కలుస్తాము అన్న ఆశా ఉండదు
కానీ ఎందుకో వాళ్ళంటే ఇష్టం
వాళ్ళు టీ వీ లో వస్తే చాలు,పరిగెత్తు కుంటూ వస్తాం
పేపర్ లో వాళ్ళ వేలు పడ్డా కత్తిరించుకోని,మన గోడలకు అతికించుకుంటాం
వాళ్ళ మాట చెవులు రిక్కించి మరీ వింటాం
మనిషంటే ఇలా ఉండాలి రా అంకుంటాం
అలా నేను అనుకోనే వారిలో మొదటి వ్యక్తి “అబ్దుల్ కలాం”
రాష్త్రపతి అంటే ఇలా అని ఎప్పుడో చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం లో చెప్పారు:ఇన్ని ఏళ్ళ వయసు నిండాలి,భారత పౌరుడు అయ్యి ఉండాలి,ఎటువంటి నేరచరిత్ర ఉండకూడదు,ఎటువంటి పార్టీ కీ చెంది ఉండకూడదు వగైరా(క్షమించాలి..ఆఖరి రెండూ ఇప్పుడు తప్పనిసరి,రాజ్యాంగాన్ని త్వరలో సవరించాలి)
తన పదవీ కాలం లో రాష్ట్రపతి కి కొత్త నిర్వచనం చెప్పారు,”రబ్బర్ స్టాంపు”,పార్టీ అద్యక్షుడి చట్రం లాంటి పదాలను తిరగారిసింది బహుశా ఈయనేనేమో.
నిత్యం చిరునవ్వుతో భావి భారత పౌరులని ఉత్తేజితం చేస్తూ,శాస్త్ర విఙ్ఞానం పై నిరంతరం ఆశక్తి కలిగిస్తూనే ఉన్నారు.
అసలు రాష్ట్రపతి అంటే ఈయనేరా…అని ఎన్ని సార్లు అనుకున్నానో
తొలి మహిళా రాష్త్రపతి ఎన్నిక జరిగిన తీరు చూస్తే ఎందుకో మనసు కల్లుక్కు మంది
సామాన్య పౌరుడి గళానికి విలువలేని ఈ ఎన్నిక ఎంత వరకు సబబు??
నా ప్రాంతపు ఎం ఎల్ ఏ కనీసం వోటు వెయ్యలేదు!
ఇక నాలాంటి వారి అభిప్రాయం(కనీసం కాగితం మీదైనా) పరిగణలో తీసుకోలేదు
అసలు రాష్ట్రపతి అంటే కచ్చితం గా ఎదో ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలా??
రాజ్యాంగ నిపుణులో,దేశన్ని నిజం గా ముందుకు నడిపించే వారో కాదా??అలాంటి వాది పేరు వినిపించినా ఎవరూ మదత్తు ఇవ్వరేమో!!
మహిళా సాధికారత,విలువల విజయం వంటి పదాల ముసుగులో,తన మీద ఉన్నా నేరాలను కనీసం ఖండిచలేని తొలి మహిళా రాష్ట్రపతీ……..నీకు నా ____( మా సోనియా గాంధీ,ఇటలీ నుంచీ ఇంగ్లీషుకు,ఇంగ్లీషు నుంచీ హిందీ కి,హిందీ నుంచి తెలుగులోకీ తర్జుమా చెయ్యించుకోని ఈ ఖాళీ ని పూరిస్తారు)
పూర్తిగా చదవండి