అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి ఆలోచనలకు సరిగ్గా సరిపోయేలా ఒకాయన సినిమా పత్రికనొకదాన్ని నడిపేవాడు. ప్రపంచంలోని మంచి సినిమాలను ఫ్రాన్సు ప్రజల దగ్గరకు తేవాలని నిర్ణయించుకుని తన పత్రిక ద్వారా సినిమా సమీక్షలు, విశ్లేషణలు చేస్తుండేవాడాయన. మన దేశంలో మంచి సినిమాలెలాగూలేవు కనీసం ప్రపంచంలోని మంచి సినిమాల గురించైనా తెలుసుకున్నట్టవుతుందనే ఉద్దేశంతో ఈ పత్రికాఫీసుకి వచ్చి ఎలాగో వుద్యోగాలు సంపాదించారా కుర్రాళ్ళు. ఈ సినిమా పిచ్చోళ్ళ పనేంటంటే మంచి సినిమాలు చూడడం, వాటి గురించి విశ్లేషిస్తూ వ్యాసాలు రాయడం. ఇటలీ లోని neo-realism సినిమాలు, అమెరికాకు చెందిన Hitchcock, Howard Hawks లాంటి దర్శకుల చిత్రాలను చూసి విశ్లేషించే వారు ఈ కుర్రాళ్ళంతా! వీరితో పాటే రాస్తూ వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వుండేవాడా పత్రికా యజమాని.
పూర్తిగా చదవండి