మనుష్యులు ఇంత కేర్‌లెస్ గా ఉంటారు అన్నది మాత్రం నాకు అసలు అర్థం కాలేదు. ఈరోజు నేను బండి నడుపుతూ రోడ్డు పై వెళుతున్నాను. వెనక మా అమ్మ కూర్చుని ఉంది. రోడ్డేమో చిన్నది. అవతలవైపు నుంచి ఓ కారు వస్తోంది…నా బండి పక్కగా వెళ్ళింది ఆ కారు. అసలే రోడ్డు పై స్ట్రీట్ లైటు కూడా లేదు. కారు వాడేమో సగం తాగిన కాలుతున్న చిగెరెట్టు కిటికీ లోంచి విసిరేసాడు!!! కాస్తుంటే అది నా బండి మీద పడాల్సింది… ఏదో నా టైం బాగుండి పక్కన పడ్డది. ఎవర్నని అనగలం? ఆ చిన్న రోడ్డు లో మనం ఆపి గొడవ మొదలెడితే వేరే రకం గొడవ మొదలౌతుంది అక్కడ… ట్రాఫిక్ జాం గొడవ! మనసులో తిట్టుకుని ముందుకు కదిలాము. :(

     ఇంత కేర్‌లెస్ గా ఎందుకు ప్రవర్తిస్తారో మనుషులు. పొగ తాగడం మంచి అలవాటా? కాదా? అన్న విషయం పక్కన పెడితే … బహిరంగ ప్రదేశాల్లో ఈ ప్రవర్తన ఎంత వరకు సమర్థనీయం? బస్సుల్లో తాగిన పీకలు అక్కడే పడేయడం.. లేదా…కిటికీల్లోంచి కిందకు ఉమ్మడం … తాగి బస్సెక్కి పక్క వాళ్ళ మీదకి తూలడం … ఇవి అన్నీ తలుచుకుంటేనే ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి..? “అసలు అవతలివైపు నేనుంటే?” అని ఆలోచించరా ఈ పనులు చేసేవాళ్ళు??


పూర్తిగా చదవండి