- పొనుగోటి రవి కుమార్ అక్షరాన్ని దిద్దాను చూపుడు వేలుతో మూడు వేళ్ళు చూస్తున్నై నా వైపు శూలంలా! నల్లమట్టి మీద అక్షరాన్ని గల్లతొట్టిమీద తోలులా దిద్ది రుద్దిన ఐదోవేలికి అంటుకుంది! అక్షరం! చెరువుకి ఎదురీది బోధివృక్షం నీడలో చేపలా పడ్డ అక్షరాల వలలో నాకు వాడికి మధ్య ‘అక్షరం’ వాడకి ఊరికి మధ్య దున్న సియ్యలా! ఊరిబడి చుట్టూ పసుపునీళ్ళతో దిష్టి తీసి విసిరాడు నిర్భంధ తాళపత్రాల్ని అటుఇటు వాడికి నాకు మధ్య మళ్ళా ‘అక్షరం’ త్రిశంకుస్వర్గంలా వాడల్ని ఊరి చెర తప్పించడానికి మసీదు నీడలో శిలువ ఎక్కాను! అక్షరం మరింత హత్తుకుంది నన్ను వదిలింది పూనకం! అక్షరం అంటుకుంది వాడవాడలా అంటరానితనంలా!! మర్రిచెట్టు కింద మోడువారిన మల్లె తీగలన్ని దండోర వానలో తడిసి చిందులేస్తుంటే అక్షరం కట్టతెగిన చెరువులా బద్దలై వాడలవైపు పెయ్యిదూడలా [...]
పూర్తిగా చదవండి