- సుదయ్య మాకొద్దీ మాల దొరతనమూ- బాబు మాకొద్దీ దళితదొరల జులుమూ దేవ! తెలిసిపోయె మా సోదరుల గుణమూ 1. అంబేద్కరు పేరు జెప్పి హక్కులెన్నో అడుగుతారు జైభీముల గొట్టుకొంటు పోరు జెయ్యమంటారు మాది గోల్లమాటంటే మండిపడి చస్తారు ॥మా కొద్దీ॥ 2. డక్కలోల్లు, బుడిగె, బైండ్లోల్లు గొడారులూ చమారులూ రెల్లివాల్లు పాకివాల్లు ఉపకులాల ఊసెత్తితె ఉరిమురిమి జూస్తారు ఉమ్ము వేయ వస్తారు ॥మా కొద్దీ॥ 3. కలిసి పోదమంటారు కలిసి నడవమంటారు కలిసి పంచుకుందమంటే కయ్యానికి లేస్తారు మా కడుపుల మన్నుబోసి మా ఎముకలు నములుతారు ॥మా కొద్దీ॥ 4. మా తిండిని తిననియ్యరు మా గోసను ఇననియ్యరు మా కుత్కెలు పిస్కబట్టి మా పేగులు కోస్తారు ఆకలితో అరుస్తుంటే అనుభవించమంటారు ॥మా కొద్దీ॥ 5. కుల [...]
పూర్తిగా చదవండి