- శిఖామణి
రోజూ అవే అంకెల మీద
తిరిగిన అంకెల మీదే
తిరుగుతున్న
గడియారంలోని ముల్లులా
ఈ రోడ్ల మీద
నా కొయ్యకాలు
టక్… టక్… టక్…
నగరం రద్దీలో
నేను
కాలు పోగొట్టుకోకమునుపే
ఏ అడవో
ఈ చెట్టును పోగొట్టుకుంది.
అడవి అడవంతా
వసంతోత్సవంతో
నృత్యం చేస్తుంటే
కుష్ఠురోగపు భర్తను
నెత్తిన మోస్తున్న
పతివ్రతలా
నా కొయ్యకాలు
నన్ను కావలించుకునే వుంది.
చెవిటిదీ, మూగదీ, అవిటిదీ
అని తెలియక
రోడ్లు ఏవేవో చెప్తుంటాయి.
పత్రికల్లో
అందమైన కవిత్వం మధ్య
తెల్ల మచ్చల గురించి
నల్ల వెంట్రుకల గ్యారంటీ
గురించి
నరాల బలహీనతల గురించి
అసహ్యమైన ప్రకటనల్లా
అందమైన రోడ్ల మీద
నా కొయ్యకాలు వికృతంగా
కొందరిని భయపెడుతూ
కొందరి జాలినీ
సానుభూతినీ పొందుతూ…
అర్ధరాత్రి
కోర్కెలతో బరువెక్కిన
నా దేహాన్ని
‘ఆ కాసేపూ’ భరించి
నన్ను తేలికపరచే నా భర్య [...]
పూర్తిగా చదవండి
- కాసుల ప్రతాపరెడ్డి
లోపలివీ, వెలుపలివీ
మనసు పొరల్లోకి ఇంకుతయి
చెట్టుకు పూసిన పుష్పం ఈ దేహం
వాడకుండానే రాలిపడాలె
ఆత్మ ఒడ్డున పడ్డ చేప పిల్ల
ఈ శాపమెప్పటిదో, ఎవరిదో
ఊపిరాడక తన్నుకుంటూ ఉంటది
నిన్నటికీ నేటికి ఎంత తేడా
వాన చుక్కలు పెదవిని ముద్దాడుతుంటయి
ఆరాటం, పోరాటం
ఆశానిరాశాల ఊగిసలాట
పొత్తు కుదరని తండ్లాట, తల్లడమల్లడం
మనసు వేగాన్ని దేహం అందుకోదు
ఈ నేలకు ఎందుకింత ప్రేమ
ఆత్మనూ దేహాన్నీ మోస్తది
కన్ను మూసుకున్నా పట్టని నిద్ర
తొవ్వల మీద నెత్తురోడుతున్న పావురాలు
మోదుగుచెట్టు ఒళ్లంతా పూలే
ఎందుకొస్తామో, ఎందుకు పోతామో
నేలతల్లి పచ్చి పుండు అయితనే వుంటది
నీటి మీద [...]
పూర్తిగా చదవండి
- వెంకటేష్
జీవితాన్ని కూల్చడం ఇప్పుడు మరింత సులువు
గ్లోబలైజేషన్ మనకు తెలియకుండా మనను
మార్చుతున్నంత సులువు!
ఆనాది నుండి నేటి ఆధునిక టెక్నాలజీ వరకు
బలవంతుడికే ప్రాణాలు తీసే హక్కు
ఒక్క తూటకు చిటికెలో పనైపోతుంది.
భూమి కోసం…
ఇక్కడ భూమి అంటే కేవలం నేల కాదు
నా కన్న తల్లితో సమానం
తల్లి జన్మ నిస్తే భూమి కడుపు నింపింది
ఆలాంటి తల్లి నాకు అంగట్లొ సరుకై పోతున్నది
అమ్మ ఇప్పుడు నా చేతులు దాటి అకాశం వైపు బిత్తర
చూపులు చూస్తున్నది …
ఇప్పటి నా తల్లి [...]
పూర్తిగా చదవండి
మొన్న మక్కా మసీదు, నేడు లుంబినీపార్క్ గోకుల్ ఛాట్ లలో బాంబుదాడులు
మానవత్వంపై దాడి – మనుష్యులపై మారణకాండను ఖండిద్దాం!
మనోనిబ్బరాన్ని ప్రదర్శించి, టెర్రరిజం ఓడిపోతుందని చాటిన ప్రజలకు బాసటగా నిలుద్దాం !
హైదరాబాదు లుంబినీ పార్క్, కోఠిలోని గోకుల్ ఛాట్‌లలో 25.08.2007 సాయంత్రం 7.40కి దుష్ట శక్తులు అత్యంత శక్తివంతమైన బాంబులు పేల్చారు. 44 మంది చనిపోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరి చర్యల్ని ఆంధ్రదేశం, ప్రపంచమంతా ఖండించింది. క్షతగాత్రులకు, బాధిత ప్రజలకు అందగా నిలుస్తూ [...]
పూర్తిగా చదవండి
- స్కైబాబా
ఇవాళ తెలుగు సాహిత్యంలో ముస్లింవాదం గురించి సర్వత్రా చర్చ నెలకొని ఉంది. ముస్లింవాదం అంటే అస్సలు గిట్టనివారు సైతం ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని ఈమధ్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల బయటే కాక లోపలా కొన్ని ప్రశ్నలూ కొంత అయోమయం నెలకొంది.
ముస్లింవాదం నిలదొక్కుకోవడానికి కృషి చేసినవారి పైనే నిందారోపణలూ నేరారోపణలూ జరుగుతున్నాయి. ముస్లింవాదం గురించి ఇన్నాళ్ళూ ఎక్కడా ఏమీ మాట్లాడని, రాయని, పని చేయని వ్యక్తులు కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. [...]
పూర్తిగా చదవండి
- డా॥ దార్ల వెంకటేశ్వరరావు
ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? అనుకుంటూ చూశాను.
తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు. గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు.
వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన్ని గడపాలనుకుంటే, ఈ సమాజం [...]
పూర్తిగా చదవండి
- ముదిగంటి సుజాతారెడ్డి
వర్తమానకాలంలోని అస్తిత్వవాదాల్లో తమతమ అనుభవాల అభివ్యక్తీకరణం ప్రాధాన్యం కలిగివుంది. ఎవరి అనుభవాలను వాళ్ళే చెప్పుకోవాలి, మరొకరి అనుభూతులు సానుభూతులు మాకు అవసరం లేదు, మా పోరాటాన్ని మేం చేస్తాం అన్నది స్త్రీ దళితవాదాల్లో వ్యక్తమౌతున్నది. అంటే అస్తిత్వవాదాల్లో ‘స్వానుభవ’ వ్యక్తీకరణం ఆ సాహిత్య అభివ్యక్తి నిర్వచనం! ఆ నిర్వచనంలోంచి వచ్చిందే ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ చైతన్యం.
ప్రాంతీయత, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ చైతన్యం అనే పదాలు 1990 దశకం నుంచి [...]
పూర్తిగా చదవండి
- వరవరరావు
ముదిగొండలో ఇళ్ళ స్థలాల కోసం పోరాడుతున్నవారిని మాజీ నక్సలైటు రెచ్చగొడుతున్నాడనే నెపంతో గ్రేహౌండ్స్ ప్రవేశించి కాల్పులు జరిపారు. వాకపల్లిలో మావోయిస్టులకు ఆశ్రయం ఇస్తున్నారనే నెపంతో గ్రేహౌండ్స్ గాలింపు చర్యలు జరిపి పదకొండుమంది ఆదివాసీ మహిళలపై లైంగిక అత్యాచారం చేసారు.
రాజ్యం చేసిన ఈ అత్యాచార బాధితులను కులకట్టుబాట్ల హిందూ వ్యవస్థ ప్రభావం వల్ల భర్తలు దూరం ఉంచి పాలచేపుల తల్లుల దగ్గరికి ఆకలితో ఏడుస్తున్న పిల్లలని చేరనివ్వడంలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఆచరిస్తున్న వాళ్ళకు ప్రకృతిసిద్ధమైన [...]
పూర్తిగా చదవండి
- చలసాని ప్రసాద్
మనసు మూగబోయింది…
సహవాసి అస్తమించాడు. మనసు మూగబోయింది. అంతరంగం అంధకార బంధురమైంది. గుండెల్లో సుడిగుండాలు చెలరేగాయి. “O! death! death to a dove ” అన్నాడో ఇంగ్లీషు కవి. ‘ఏ నాటికైనా మానవజాతి మరణాన్ని జయిస్తుంది’ అన్నాడు మన మహాకవి. అందాకా ఈ వేదన మనని వీడదు.
నిజం చెప్పాలంటే సహవాసి నాకన్నా రెండేళ్లు చిన్న. అయినా తాను ముందుగానే సెలవంటూ వెళ్లిపోయాడు. ఎందుకని? ఏమో చెప్పలేం! దిగులు చెందడం మానలేం. [...]
పూర్తిగా చదవండి
- ధూళిపాళ అన్నపూర్ణ
“టాల్‌స్టాయ్ ‘సంసార సుఖం’ చదవాలని ఉంది సుజా! ఒక్కసారివ్వవా?'’ అంది జ్యోతి.
నా టేబుల్ మీద ఎదురుగా ఉన్న ఫోటోస్టాట్ కాపీ తీసి ఇచ్చాను.
“అబ్బ! ఏమిటే ఇంత చిన్న ప్రింట్. ఇంత దగ్గరగా ఉన్న అక్షరాలు! ఎలా చదువుతున్నావ్. మొత్తం నలభై పేజీల కథ మూడు పేజీల్లోకి వచ్చేసింది. నేనిలా చదవలేను. మామూలు పుస్తకం లేదా?'’ అంది.
లోపలికి వెళ్ళి రేక్ లోంచి ‘ఆర్వీఆర్’ ట్రాన్స్‌లేషన్ ‘విషాద సంగీతం’ తెచ్చి ఇచ్చాను. రవి [...]
పూర్తిగా చదవండి
- ఎ.గాంధి
సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు ఇకలేరు. తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి. ఆయన అనువాదమయినా, సంపాదకీయమై నా, పత్రికావ్యాసమయినా సహజంగా ప్రౌఢంగా ఒక జీవనదీ ప్రవాహంలా సాగిపోతుంది. ఆయన పేరులేకపోయి నా ఆయన శైలినిబట్టి ఇది సహవాసి రచన అని చెప్పగలిగే పాఠకులు ఆంధ్రదేశంలో అనేకమంది ఉన్నారు.
తన రచనతో మమేకమయ్యే అరుదైన రచయిత సహవాసి. ఆ రచన ఉత్తమమైనా కాకున్నా, దాని లక్ష్యం శ్లాఘనీయమైనా కాకున్నా, ఉదాత్తమైనా కాకున్నా ఆయన ఎంతో శ్రద్ధగా [...]
పూర్తిగా చదవండి