Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రొటీను - వెరైటీ

Telugu కొత్త పాళీ

పూర్తిగా చదవండి

సృష్టి ఏర్పడిన విధానం - సృష్టి తత్వాలు

ఆధ్యాత్మికం హాసిని
సృష్టికి పూర్వం భగవంతుడు ఒక్కడే ఉండేవాడు. సృష్టికి కారణమైన మాయాశక్తి ఆయనలో నిద్రాణమై ఉండేది. సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగినప్పుడు ఆయన తన మాయాశక్తిని (ప్రకృతిని) జాగృతం చేసి, పురుషరూపంలో చైతన్య శక్తిని ప్రవేశపెట్టాడు. అప్పుడు నామరూపాలు లేని (అవ్యక్త) మాయాశక్తి నుంచి మహత్తత్వం ఆవిర్భవించింది. విజ్ఞానాత్మకమై, తమస్సును(అజ్ఞానాన్ని) హరించే ఈ మాహత్తత్వం అనేక మార్పులు చెందగా అహంకారం అనే తత్వం
పూర్తిగా చదవండి

ధ.దే.ఈ.శు.— జోకు

జోకు, నవ్వించావు లేవోయ్ విహారి
: మొన్న తానా సమావేశాలు జరిగినప్పుడు మేడసాని మోహన్ వారి అష్టావధానానికి హాజరు అయ్యాను. అందులో పృచ్చకుల్లో ఒకరైన కూచిబొట్ల ఆనంద్ గారు సంధించిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మేడసాని గారు ఈ కింది జోకు చెప్పారు. “ఈ లోకంలో ఆడ వారి మాటను జవ దాటగల వారెవరైనా వుంటారా” అని శ్రీ కృష్ణ దేవరాయలు గారికి అనుమానం వచ్చిందట. వెంటనే తన ప్రధాన మంత్రి ని పిలిచి అడిగాడట. “మాహా మంత్రీ! నేను భారత దేశంలోని
పూర్తిగా చదవండి

భావవిప్లవకారుడు కొడవటిగంటి

ఉల్లేఖనలు ప్రజాకళ
జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడి ఉన్నది. ఆ పోరాటంలో ప్రజల చేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవసాహిత్యం. ఇందుకు అంగీకరించనివారు జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడలేదని రుజువు చెయ్యాలి; చెయ్యలేరు. - కొడవటిగంటి కుటుంబరావు
పూర్తిగా చదవండి

కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1

వ్యాసాలు ప్రజాకళ
- త్రిపురనేని మధుసూదనరావు సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని గురించి బాధపడేవాళ్ళు చాలామంది వున్నారు. ప్రకృతి మీదా, సమాజం మీదా శాస్త్రీయమైన అవగాహన కలిగించవలసిన సాహిత్యం మూఢవిశ్వాసాల్ని ప్రచారం చేయటం అన్యాయమే. కులాల్నీ, మతాల్నీ సమర్థించడం, దేవుళ్ళనీ, దెయ్యాల్నీ ఆవాహన చేయటం, స్త్రీని కించపరచటం వంటి పనుల్ని సాహిత్యం ద్వారా చెయ్యటం సామాజిక ద్రోహమే. ప్రగతిశీలవాదుల్లో ఈ విషయంలో ఏకాభిప్రాయం వుండటం కూడా సంతోషించదగ్గ విషయమే. గురజాడ వంటి సంస్కరణవాదుల కంటే పూర్వం వున్న కవులందరూ సాహిత్యంలో మూఢవిశ్వాసాల్ని చెప్పినవాళ్ళే. మనిషి కంటే [...]
పూర్తిగా చదవండి

కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2

వ్యాసాలు ప్రజాకళ
- త్రిపురనేని మధుసూదనరావు “ఈనాడు రచయితలకు పెద్దగా భాషాజ్ఞానమూ, పాండిత్యమూ ప్రాచీన సాహిత్య పరిచయమూ అవసరం లేదన్నది ఏనాడో నిర్ణయమయింది. కానీ వారికి ప్రపంచజ్ఞానమూ జీవితానుభవమూ, సామాజిక దృక్పథమూ కూడా అవసరం లేదన్నది రానురాను రుజు వవుతున్నది, ఇతివృత్తాలలోగాని, పాత్రపోషణలోగాని, సన్నివేశాలలోగాని ఎలాటి వాస్తవికతా అవసరం లేదు” (కొ.కు.) అని వ్యంగ్యంగా అన్నాడు. భాషాజ్ఞానం, పాండిత్యం, ప్రాచీన సాహిత్య పరిచయం ఈనాటి కవులకి అవసరం అనేది కొ.కు. అభిప్రాయం. వీటికంటే ముఖ్యం ప్రపంచజ్ఞానం, జీవితానుభవం, సామాజిక దృక్పథం వాస్తవిక రచనలు [...]
పూర్తిగా చదవండి

ధ్వజం! –5

ధ్వజం (కథ) వింజమూరి విజయకుమార్
తర్వాత, తొమ్మిదేళ్ళలో సువర్చల మరో ఆరుమందికి జన్మనిచ్చింది. వాళ్ళలో పెద్ద వాళ్ళిద్దరూ మగపిల్లలు. తర్వాతి ముగ్గురూ ఆడపిల్లలు. చివరివాడు మళ్ళీ మగవాడే. కానీ, బాబూ కృష్ణమూర్తీ ఆ చివరివాడున్నాడే వాడు అసాధారణమైన సౌందర్యం గలవాడు. అద్బుతమైన రూపవంతుడు. “కాకి పిల్ల కాకికి ముద్దం”టారు. “హంస పిల్ల అందరికీ ముద్దే”నని వాడు పుట్టిన ఒకటిన్నర సంవత్సరం లోనే నిరూపించినాడు. ఆ చుట్టుప్రక్కల వూర్లలో వుండే ప్రజలంతా
పూర్తిగా చదవండి

నాన్సీ డ్రూ తెచ్చిన కష్టాలు

Telugu, తెలుగు Giri
ఏడో ఎనిమిదో తరగతి. తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు తప్పి త్వరితగతిన ఇంగ్లీష్ పుస్తకాలు తినేయడం మొదలు పెట్టిన తరగతి. కొత్త పుస్తకాలు కొనే డబ్బు ఉండేది కాదు కాబట్టి, అబిడ్సు కోఠీలో దారి పక్క అమ్మబడే పాత పుస్తకాలే గతి. ఇప్పుడంటే అమ్మాయిలకి అబ్బాయిలకి బొమ్మలతో మొదలెట్టి బట్టలదాకా, చెప్పులతో మొదలెట్టి చుట్టలదాకా (సరే, చుట్టలు కాదు సిగరెట్టులే!), పుస్తకాలతో మొదలుపెట్టి చిత్రాలదాకా, వేర్వేరు రంగులు
పూర్తిగా చదవండి

నా ఇల్లు బంగారం ..నీ ఇల్లు ఇత్తడి …

Telugu Gowri Shankar Sambatur

పూర్తిగా చదవండి

స్నేహం, ప్రేమ…. ఒకే చిత్రంలో

Telugu Tulasi Ram Reddy

పూర్తిగా చదవండి

నిగర్వి

Telugu, తెలుగు Giri
విహారి బ్లాగ్ లో కృష్ణదేవరాయల వారి కధ చదవగానే నాకు చిన్నప్పుడు చందమామలో చదివిన కధ ఒకటి గుర్తుకు వచ్చింది. ఆ కధ సారాంశము ఇది. ఒక రోజు మీసంమెలేసుకుంటున్న రాజు గారికి అసలు లోకంలో గర్వమంటూ లేనివాడు ఉంటాడా అని ఒక చిన్న సందేహం కలిగింది. రాజు తలచుకుంటే కొరడాదెబ్బలకే తక్కువ లేదన్నప్పుడు, వెట్టి చాకిరీ కొదవా? వెన్వెంటనే మంత్రి హాజరు కావడం, రాజ్యంలో ఉన్న నిగర్వులందరినీ పట్టి తేవలసిందను పని ఆయన తలమీద పడడం
పూర్తిగా చదవండి

నా తొలి ప్రేమ కథ- రెండవ భాగం

కథలు శ్రీ
సమయం ఉదయం 5.30 గం.ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. చిరంజీవి గారి పాత సినిమాలలో పాటల్లో ఎక్కువ తెల్ల చొ...
పూర్తిగా చదవండి

ఈ రోజు బ్లాగు - నువ్వుశెట్టి

Blog-Of-The-Day venkat.siddareddy
తేది: ఆగష్టు 3, 2007 చిరునామా: http://nuvvusetty.wordpress.com/ గురించి: తెలుగు అక్షరవర్ణమాలలో యాభై ఆరు సౌగంధాలను, ఎప్పటినుంచో అటూ ఇటూ మారుస్తూ ఆశగాఉన్నా ఎప్పటికైనా రాకపొతుందా … నలుగురు మెచ్చే ఓ నవకవితా భావమాలిక నాకొసం అని…… అప్పటి దాకా ఇలా….. సొంతదారు: నువ్వుశెట్టి సోదరులు(?)
పూర్తిగా చదవండి

అడుగడుగునా ముళ్ళే… ఎక్క్డడ అడుగుపెట్టను..

విమర్శలు-రాజకీయం శ్రీ
ఒకసారి ఇది నేను గతంలో ఎప్పుడో రాయాలనుకున్న కవిత. కాని ఇప్పటికీ సశేషంగానే మిగిలిపోయింది.**బరువ...
పూర్తిగా చదవండి

ఇది భక్తా లేక బలహీనతా

నా సోది వికటకవి
నా చిన్నప్పుడు స్కూల్లో చదివే రోజుల్లో, కొందరు అకస్మాత్తుగా కొన్ని కరపత్రాలు రోడ్డుపైనో, మరెక్కడో వెదజల్లి పోయేవాళ్ళు. ఏమిటో అని చదివితే, ఈ పత్రం చదివినవారు ఫలానా దేవుడు/దేవత యొక్క వంద లేదా వెయ్యి పేర్లను ఒక కాగితం పైన రాసి ….. లేదా మీరు నాశనం అవుతారు … గట్రా గట్రా. నాకు బాగా గుర్తు. దెబ్బకి అదిరిపోయి, అష్టకష్టాలు పడి (ఉన్న హోంవర్క్ కి తోడు) రాసి గుళ్ళో పడేసొచ్చేవాళ్ళం. అదేదో చిన్నతనం అనుకున్నా, [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS