నా తొలి ప్రేమ కథ- మూడవ భాగం
కథలు August 4th, 2007
అదృష్టం వీపు గోకడమేంటి అని కదా మీ సందేహం. నాకొక సామెత గుర్తు. " మంచి వాని దగ్గరకు మంచివాన్ని పంపినారు. కాని నీ దగ్గరకు మాత్రం నన్ను పంపినారు" అని. నా వెనుక కూర్చున్న ఒకడు నా వీపు గోకాడు. వెనక్కు తిరిగి "ఏంటి?" అని అడిగాను. "నేను కొంచెం లెక్కల్లో వీకు" పోలీసులు పొలిటిషియన్స్ దగ్గర నసిగినట్టు చెప్పాడు. నాకు విషయం అర్థమయింది. మీద నేను చెప్పిన సామెత చెప్పి.. "నేను నీ టైపు కాదు" అని చెప్పాను. వాడికేం అర్థం కాక "గడ్డి మింగినపుడు లాలూ ప్రసాద్ యాదవ్" లా కూర్చున్నాడు మారు మాట్లాడకుండా. నేను మళ్ళీ నా సిరివన్నెల సింగారి ఊహల్లోకెళ్ళాను.
ఒక పది నిమిషాలు గడిచాక వెనుకవాడు మళ్ళీ వీపు గోకాడు. వెనుకకు తిరిగి "ఏంటి బాబు నీ దురద! ఊరికే గోకుతున్నావు" అన్నాను. "ఈ సారి నేను కాదు గోకింది. అదిగో ఆమె" అని అతని పక్క సీట్లో ఉన్నా అమ్మాయిని చూపించాడు. "ఏం పోయేకాలమో ఏంటో! చదివి చస్తే పక్కోడి వీపు గోకే అవసరం ఉండదు కదా! అయినా అమ్మాయిలకు కూడా ఏం పోయేకాలం." అనుకుంటూ తల తిప్పి ఆ "పర్యుత్సుక వదని" (బాధా పూరిత వదనము గలది) ని చూశాను. మంచి నీళ్ళ కోసం బావిలో దూకినట్టుంది నా పరిస్తితి. నన్ను గోకిన ఈ గోపకన్యే ఆ గోప్య సుందరి.
ఆ అమ్మాయి "నేను కొంచెం లెక్కలలో వీకు" అని చెప్పింది. ముందువాడు చెప్పిన డైలాగే కాని ఈ సారి మన్మథుడి తో రతీ దేవి "నేను కొంచెం లెక్కలలో వీకు" అని చెప్పినట్టుంది. నా పేపరు మొత్తం తీసి ఆమె చేతిలో పెట్టి ఆమెనే చూస్తున్నాను.
పొగడచూచిన అందునా ఆ పొగడపూవుల
సుమాలికా సుగంధములు;
అందగోరిన దొరకునా హరివిల్లుల
సప్తవర్ణములు;
చూడదలచిన కనిపించునా
మేనిని స్పృశించు ఆ పిల్ల తెమ్మరలు;
నాకవి దొరకనేల, నేలచెప్పెద నా బాల
వేల వన్నెల జ్వాల..
ఎంత అందం గా ఉందో!! మొన్న చూశాను కాని సరిగ్గ చూడలేదు. తుఫాను సమయంలో హెలికాప్టర్ దర్శనం లా ఉంది మొన్నటి దర్శనము. ఈ రోజు నా కళ్ళ ముందు నా దేవత, నా పేపరులో కాపీ కొట్టి మరీ పరీక్ష రాస్తుంది. మైమరచి పోవడం అంటే ఏంటో నాకు ఖచ్చితంగా తెలీదు కాని, అలాంటిదే ఒక రకమయిన మత్తులో జారుకున్నాను.. తననే చూస్తూ.
క్షణాలు దొర్లుతున్నాయి. ప్రపంచం కూడా బ్యాటరీ సహాయం తో తిరిగితే బాగుండు. ఫ్యూజు పీకేసేవాన్ని అనుకున్నాను. ఏం చేయను మరి! కాలం మేఘం లా కదులుతూ ఈ వెన్నెల ను దాచేసేలా ఉంది. నా కళ్ళు హాండి కామ్ లాగా ఆమెను రికార్డు చేసుకున్నాయి. 3 గంటలు పూర్తయింది. ఈ యాత్రలో సగం సుధీర్గయాత్ర కాగా మిగిలింది హ్రస్వ యాత్ర. పేపర్ ఇవ్వగానే మారు మాట్లాడకుండా, కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది.
....
తరువాత పరీక్షకు కనిపించలేదు. ఆమె ఫెయిల్ అయిన బాపతు అనీ, లెక్కల పరీక్ష మాత్రం మిగిలితే రాసేసుకుని వెళ్ళిపోయిందని తెలుసుకున్నాను. హాస్టలు చేరుకుని కన్నీరు పెట్టుకున్నాను. ప్రేమించే వయసుతో పాటు, భరించే వయసు కూడా లేదు మరి నాకు. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన పొలిటిషియన్ లా బాధ పడ్డాను. పరీక్షలు అయిపోయాయి. సెలవుల పర్వం అంతా ఆమె ఆలోచనలే.. తొలి ప్రేమ మరి. కనీసం పేరయినా అడగలేదు- నామ స్మరణ చేద్దామనుకుంటే..
సెలవులయిపోయాయి. ఎర్రజెండా ఊపితే రైలు ఆగుతుంది. కాని ఈ కాలేజి స్టార్ట్ కాకుండా ఉండాలంటే ఏ జెండా ఊపాలో తెలీదు మరి. సాధారణం గా తుఫాను తర్వాత ప్రశాంతత అంటారు. కాని కాలేజి ప్రశాంతత తర్వాత తుఫాను. ఒక శుభ దినాన కళాశాల పునః ప్రారంభం. క్లాసులు, స్నేహితులు పరీక్షలు యధాతథం గా జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఒక రోజు..........................
(గాలి పటం అయితే ఎగిరిపోయింది కాని, దారం ఇంకా నా దగ్గరే ఉంది... దీనికర్థం రేపు చెప్తాను.. )
పూర్తిగా చదవండి