ఒక అతడు- ఒక ఆమె (మొదటి భాగం)
కథలు August 7th, 2007
ఈ రచన నా మనసు లోతులను కదలిస్తూ వచ్చింది. రాస్తున్నప్పుడు కొన్ని సార్లు కన్నీరు నాబుగ్గల మీద జారింది. ఎందుకంటే ఈ కథలో కొంతభాగం నా జీవితం. ఈ కథ కంప్యూటర్ యుగం లో కూడా పల్లెలలో ప్రభలిన మూఢ నమ్మకాలకు ప్రతీక. ఒక తెలివయిన అమ్మాయి- ఒక తెలివయిన అబ్బాయి కథ ఇది. ఆమె మట్టిలో కలిసిపోయింది. అతడు మరణపుటంచులను తాకి వచ్చాడు. ఈ కథ మూడు కథనాలతో కూడుకున్నది. ముందు అతడి మాటలు. అనంతరం ఆమె మాటలు. తరువాత విధి (రచయిత పదాలు.)
నా బ్లాగు చదువుతున్న వారికి ఒక చిన్న విన్నపము. ఈ కథను సాధ్యమయినంత చిన్నగా కుదించి రాయడం మంచిదా? (నాలుగు నుండి ఆరు భాగాలు.) లేదా విపులంగా ఒక పది భాగములలో రాయమంటారా? దయచేసి కామెంట్శ్ లో రాయగలరు.
**************************************
ముందుగా అతడు....!!!
వెన్నెలలో నిన్ను చూస్త్తూ, మానవులు సంచరించని సమయం లో ఈ మరుభూమి (స్మశానం) లో నీ పక్కనే పడుకున్నాను...
’పిచ్చి పట్టిందా?’ గట్టి అరుపు.
ఎవరా అని చూశాను.. ’ఓ మీరా! రండి, రండి! ఏంటి నా ఏకాంతం లోకి మీ రాక?’ అడిగాను స్నేహితులను.
’ఏంట్రా ఇలా అయిపోయావు. జరిగినదాంట్లో నీ తప్పేముంది. తను మనతో ఉండాల్సిన సమయం తీరిపోయింది. వెళ్ళిపోయింది. చివరకు ఆమె తల్లితండ్రులు కూడా తనను మర్చిపోయారు. ఇంకా ఎంతకాలం ఈ పల్లెలో ఉంటావు. క్లాసులు పోతున్నాయి. నిన్న అట్టెండెన్స్ చూశారు. నీది చాలా తక్కుగా ఉంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. సాయంత్రం నుండి నీకోసం వెతుకుతున్నాం. ఇప్పటికి కాని తెలియలేదు- నువ్వు ఇక్కడ ఉన్నావని.’ చెప్పారు.
’నాకంటు ఎవరున్నారు రా? మానస తప్ప. అందరూ ఉన్న అనాధను. నాకున్న ఈ మానస కూడా దూరం అయ్యాక ఎందుకు బ్రతకాలి. ఎవరికోసం చదవాలి? మీరు వెళ్ళండి. నేను రాను.’ చెప్పాను. కళ్ళలో నీరు కూడా రావడం లేదు. హృదయం లో తడి ఆరిపోయిందేమో! -నా జీవితం లాగే!
గొంతు గీరగా ఉంది. పెదవుల మీద ఆనాటి నవ్వు లేదు. కళ్ళలో చురుకుదనం లేదు. హృదయం ఎంత బరువెక్కిందంటే, భూమాత మెత్తబడితే నేను తనలో కూరుకు పోతాను. స్నేహితులు ఎవేవో చెప్తున్నారు. అవి నా చెవులకు తాకడం లేదు. తను నన్ను ముద్దుగా "విజ్జూ!!" (విజయ్) అని పిలుస్తుంది.ఆ పిలుపే నాకు సర్వస్వం. కళ్ళు వెన్నెల మీద నుండి కదలడం లేదు.
నా జీవిత నావలో ఒకసారి వెనుకకు ప్రయాణిస్తే!!
అందరూ ఉన్న అనాధగా పుట్టాను. పుట్టిన ఆరు నెలలకు తండ్రి అమ్మను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నన్ను మామయ్య వాళ్ళు పెంచారు. అమ్మ ఎప్పుడూ నేను నష్ట జాతకున్ని అనీ, అందుకే నా నాన్నఎవరితోనో వెళ్ళిపోయాడనీ అంటూ ఉండేది. ఊహ తెలియక ముందు అవేవో తిట్లనుకున్నాను. అమ్మ, అమ్మమ్మ, ఇద్దరు మామయ్యలు. తాతయ్య, ఇద్దరు చిన్నమ్మలు, నేను. ఉమ్మడికుటుంబం మాది. మాది అప్పటి నక్సల్స్ ప్రభావిత అటవీ ప్రాంత సమీపంలో ఉన్న ఊరు కావడంతో నా భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని మా మామయ్య గారు నన్ను ఒకటవ తరగతిలోనే కరీంనగరు లోని ఒక ఆవాస విధ్యాలయం (రెసిడెన్షియల్ పాఠశాల) లో చేర్పించారు. మామయ్య గారు చాలా మంచివారు. ఊరు మెచ్చుకునే మనిషి. నాతో ఎప్పుడూ అంటూ ఉండేవారు, ’నా స్నేహితుడు ఒకతను జె.ఎన్.టి.యు. లో రాంక్ సంపాదించాడు. నువ్వు కూడా అలాగే బాగ చదివి మంచి రాంక్ సంపాదించాలి’ అని.
కన్నవారి ప్రేమకు, ఉన్నవారి ప్రేమకు దూరమయిన ఒక చిన్నారి ని నేను. ఒకటవతరగతిలో తల్లి వొడిలో ఆడుకోవాల్సిన వయసులో, ఉదయం ఐదు గంటల నుండి, రాత్రి పదయ్యేదాకా కదలనీయని, స్వేచ్చలేని జీవితం. దుర్భరం నిజంగా! అమ్మ చేతి గోరు ముద్దలు తినే వయసులో ఆయాల మొరటు చేతులతో, పువ్వు తగిలితే కందిపోయే బుగ్గలపై వాతలు. నాకు చిన్నతనం నుండే మొహమాటం ఎక్కువ. ఒకరు చూస్తుండగా కన్నీరు పెట్టుకునేవాన్ని కాదు. రాత్రిపూట దుప్పటి చాటున నా కన్నీరు దిండు ను తడిపేది. నా కన్నీరు లాగే నా బాధ కూడా ఆ దుప్పటిచాటున అంతర్థానమయ్యేది.
ఎదురుచూపు!! మొదట్లో నా ఎదురుచూపుకు ఒక గమ్యం ఉండేది. కాని రాను రాను నా ఎదురుచూపుకు అర్థం లేదు అని తెలిసిపొయింది. పిల్లల కోసం వచ్చిపోయే ’అమ్మ-నాన్న’లు. ఎంత అపురూపమయిన పదం ’అమ్మ-నాన్న’. నాకు దూరమయిన అపురూప సంపద. ఆదివారం అయితే తల్లి తండ్రుల రాకపోకలతో సందడిగా ఉండేది హాస్టలు వాతావరణం. నా కళ్ళు ప్రతీ అమ్మ ప్రేమను చూస్తూ ఉండేవి. అమ్మ ప్రేమకోసం వెతుకుతూ ఉండేవి. ఎంత అదృష్టవంతులు నా తోటి స్నేహితులు. నాన్న ప్రేమ- అమ్మ లాలన. అసూయ కలగలేదు. కాని, లోకం తెలియని ఆ వయసులోనే జీవితం మీద విరక్తి కలిగింది. ప్రతీ ఆదివారం నాకు చచ్చిపోవాలనిపించేది. అసలు చావు అంటే తెలియని పసితనం కూడా చావును కోరుకునేది.
సశేషం. రేపు రెండవభాగం!
రచయిత మాటలు:
చిన్న పిల్లల మనస్తత్వం బహు సున్నితమయినది. ఇప్పటి వారి జీవితఘటనలు రేపటి వారి జీవితం కు కాంతి రేఖలు. ప్రతీ తల్లీ తండ్రీ పిల్లలను ప్రేమించాలి. లాలించాలి. కాని ఒంటరి వాళ్ళను చేయకూడదు. మీ లాలన వాళ్ళ జీవితానికి వెలుగునివ్వాలే కాని, భవిష్యత్తును చీకటి చేయకూడదు. నా కొడుకు తప్పుదార్లు తొక్కుతున్నాడండీ అని పక్కవారితో చెప్తూ ఉంటారు ఈ కాలం తండ్రులు. ఆ మాట చెప్పడానికి నిజానికి సిగ్గుపడాలి. భార్యా భర్తలు సంపాదన లో పడి పిల్లలను పూర్తిగా దూరం చేసుకుంటున్నారు. ఉద్యోగం నుండి రాగానే హోంవర్కు అయిందా? మార్కులెలా వచ్చాయి. అంతకన్నా లాలన ఏం ఉండదా? పిల్లలకోసం సంపాదిస్తున్నాము అని తృప్తి పడడం మాని, మనసుతో పిల్లలను ప్రేమించండి. లాలించండి.
(నేటి పిల్లల దుర్గతి, బయటకు చెప్పుకోలేని బాలికల మానసిక క్షోభ. వీటి మీద ఒక ప్రత్యేకమయిన బ్లాగు త్వరలో రాస్తాను.)
పూర్తిగా చదవండి