హృదయాంతరాళం లో రగులుతున్న అగ్ని...
బాధ..
బాధ..
బాధ...
బాధ..
బాధ..
....
"చచ్చిపో నువ్వు, నీకు బ్రతికే అర్హత లేదు" అంతరాత్మ శాసించింది.

అవును!
ఎందుకు బ్రతకాలి?
’నీవు లేని నేను..’
ఇది అసంభవం!!

నాకోసం తపించావు,
నా స్నేహం కోసం ఆరాటపడావు,
నేను ఆనందముగా ఉంటే చాలనుకున్నావు.
కాని నేను..
...
"నీకు భూమి మీద స్థానం లేదు"-
అంటూ వెలివేశాను...
ఇంతటి కర్కషత్వానికి
ప్రాణం ఉండకూడదు...
...
..
.. వస్తున్నాను.. నీ దగ్గరకే....
.........
.........
ఒక చల్లని చెయ్యి నన్ను ఆపింది.

మనసు తలుపులు తెరిచి చూశాను..

"తనే!"

మనసు కరిగి కళ్లనుండి నీరయిపోయింది.

"తప్పు నాదే! నిన్ను నేనే చంపుకున్నాను"

"కాదు! అది విధి.."

"బ్రతకాలని లేదు."

"కాని బ్రతకాలి. అది నీ భాధ్యత."

"నువ్వే నా ప్రాణం. నువ్వు లేక ఎలా బ్రతకను?"

"అవును నేనే నీ ప్రాణం..
నన్ను నీ నుండి దూరం చేయకు..."

అంతర్థానమయింది.
కర్తవ్యం భోదించింది.

(ఇది కథకు ఉపోధ్ఘాతం. నాలుగు పేజీల ప్రేమ కథ. రేపటి నుండి.)
పూర్తిగా చదవండి