Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సారే జహాసె అచ్చా!

దేశభక్తి గేయాలు హాసిని
సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా, హం బుల్ బులే హై ఇస్‌కీ యే గుల్ సితా హమారా,హమారా. పర్ బత్ వో సబ్‌సే ఊంచా హంసాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వో పాస్వా హమారా,హమారా. గోదీమె భేలిలీ హై ఇస్‌కీ హజార్ నదియా గుల్షన్ హై ఇస్‌కేదమ్ సే రష్‌కేబినా హమారా, హమారా. మజ్ హబ్ నహీ సిఖాతా ఆపస్‌మే బైల్ రఖనా హింధీ హై హం(3) వతన్ హై హిందూ సితా హమారా,హమారా. సారే జహాసె అచ్చా... రచన : ఇక్బాల్
పూర్తిగా చదవండి

ఆరుపదుల జ్ఞాపకాలు…

Indians/ Telugu Carani Narayana Rao
'సంకెళ్లకు తలవంచి, బానిసలా యాచించి అందుకునే జీవితం అంత విలువైనదా? అహింస అంత మధురమైనదా? అదే నిజమైతే, భగవంతుడా, ఆ జీవితం నాకు అవసరమే లేదు. నాకు స్వేచ్ఛకావాలి లేదా చావు కావాలి'... ఉరిశిక్షకు ముందు విప్లవవీరుడు భగత్‌సింగ్‌ తన డైరీలో రాసుకున్న ప్యాట్రిక్‌ హెన్రీ వాక్యం. తనను ఉరికంబాన్నుంచి తప్పించాలని ఆరాటపడుతున్న కన్నతండ్రికి ఉటంకించిన స్వరాజ్య మంత్రం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లను మినహాయిస్తే మనమెవ్వరమూ
పూర్తిగా చదవండి

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Telugu v_tel001

పూర్తిగా చదవండి

భరత మాత

దేశభక్తి గేయాలు హాసిని
నగర మాంధాత్రాది షట్చక్రవర్తుల యంకసీమల నిల్చినట్టి సాధ్వి కమలనాభుని వేణుగానసుధాంబుధి మునిగి తేలిన పరిపూతదేహ కాళిదాసాది సత్కవికుమారుల గాంచి కీర్తి గాంచిన పెద్ద గేస్తురాలు బుద్ధాది మునిజనంబుల తపంబున మోద బాష్పములిడిచిన భక్తురాలు సింధు గంగానదీ జలక్షీరమెపుడు గురిసి బిడ్డల భోషించుకొనుచున్న పచ్చి బాలెంతరాలు మా భరతమాత మాతలకు మాత సకలసంపత్సమేత... రచన : స్వర్గీయ గుర్రం జాషువ
పూర్తిగా చదవండి

విరక్తి రాగంలో విముక్తి గీతం

Telugu Lalita
I know, it is a rehash. But it is frightening how things change and remain the same too. This poem was written in the eighties and still reads true.కవి సమ్మేళనాల కోసం వ్రాసే కవితలు కొంచె...
పూర్తిగా చదవండి

మా గాంధి

దేశభక్తి గేయాలు హాసిని
కొల్లాయి గట్టితే నేమీ మా గాంధి, కోమటై పుట్టితే నేమీ? కొల్లాయి ... వెన్న పూసా మనసు కన్నతల్లి ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు కొల్లాయి... నాల్గు పరకల పిలక నాట్యమాడే పిలక నాలూగూవేదాలా నాణ్యమెరిగిన పిలక కొల్లాయి... బోసినోర్విప్పితే ముత్యాల తొలకరే చిరునవ్వు నవ్వితే వరహాల వర్షమే కొల్లాయి... చకచక నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికితేను బ్రహ్మకౌక్కేను కొల్లాయి... వాశికుడు క్షత్రియుడు
పూర్తిగా చదవండి

మరో జన్మ

Telugu తల్లపనేని మాధవరావు

పూర్తిగా చదవండి

భయము అంటే తెలిసిన రాత్రి

Telugu తల్లపనేని మాధవరావు

పూర్తిగా చదవండి

శ్రీలు పొంగిన జీవగడ్డ

దేశభక్తి గేయాలు హాసిని
శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలు పాఱిన భాగ్యసీమయు వ్రాసినది యీ భరతఖండము భక్తి పాడర;తమ్ముడా! వేదశాఖలు పెరిగె నిచ్చట ఆదికావ్యంబందె నిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా! విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు వొలికె నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా! సూత్ర యుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్యచండిమ చిత్ర దాస్యముచే చరిత్రల చెఱిగిపోయెనే చెల్లెలా! మేలి కిన్నెర మేలవించీ
పూర్తిగా చదవండి

ఎంత గొప్ప స్వాతంత్య్రం!

వ్యాసాలు ప్రజాకళ
- ఎన్.వేణుగోపాల్ ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకుల ను వెళ్లగొట్టి మహోజ్వల పోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది? స్వాతంత్య్రమంటే తెల్లదొరలు దిగిపోయి నల్లదొరలు ఎక్కడం కాదని, ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాఘికధర్మం మారడమని భగత్ సింగ్ ఇచ్చిన నిర్వచనం గుర్తుతేలేనంత మొద్దునిద్దరలో సాగాయి ఈ ఆరుపదులు. ఆ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి [...]
పూర్తిగా చదవండి

మాటల క్షణం

కవితలు ప్రజాకళ
- జాన్ హైడ్ కనుమూరి వినగల్గితే ఖాళీ సమాధి మాట్లాడుతుంది ఉరితాడు మాట్లాడుతుంది పిచ్చుకగూళ్ళ అల్లికల విశాలరోడ్లపై విస్తరిస్తున్న అహంకార పాదముద్రల్ని ప్రశ్నిస్తే దేహం కొరడాలతో చీల్చబడుతుంది గుండెలొ పొదిగిన ప్రేమను బహిర్గతంచేస్తే వీధిల్లో అవమానపు వూరేగింపౌతుంది ప్రశ్నించిన గొంతు మరణపు అంచులపై వేళ్ళాడుతుంది అవమానాల జలపాతాల్లోంచి జారి చెదిరిపడ్డ దేహం ముక్కలై ఎగసిన ధూళిలో కలసి ఒకొక్కటిగా జతచేరి ప్రవాహమై ఎగసిపడుతుంది రక్తమరకల్ని చెరపలేని చరిత్ర నిస్తేజంగా నిలబడి చూస్తుంది వరిసిన దేహం ఖాళీ సమాధి ఖాళీ వురితాడు నిశ్శబ్దమైన వీధులు కొత్తపొరను తొడుక్కుని ప్రవహిస్తూ ప్రవహిస్తూ మాత్లాడుతూనే వుంటుంది మాటలెప్పుడూ వృధాకావు కదా! మెల్లగా గమనిస్తే మనసు పొరల్నేవో తడ్తుంది వినూత్నాక్షరాల్ని దిద్దిస్తుంది కవాతు శబ్దం హృదయాన్ని తట్టిలేపుతుంది
పూర్తిగా చదవండి

జయ జయ ప్రియ భారతి

దేశభక్తి గేయాలు హాసిని
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామ చలాంచ్చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి! జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!
పూర్తిగా చదవండి

జన్మభూమి

దేశభక్తి గేయాలు హాసిని
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిని పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమో జనియించినాడ ఏ స్వర్గఖండమున ఏమంచి పూవులన్ ప్రేమించినావో నిను మోసే ఈ తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి యెందు లేరురా మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక. అందాకగల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ
పూర్తిగా చదవండి

పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా..

Telugu చేతన
పాడవోయి భారతీయుడా.. ఆడిపాదవోయి విజయగీతికానేడే స్వాతంత్ర్యదినం.. వీరుల త్యాగఫలం..నేడే నవోదయం నీదే ఆనందం..స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి..సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే సరిపోదోయి.ఆగకోయి భారతీయుడా కది్లి సాగవోయి ప్రగతిదారులా..ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..అవినీతి బంధుప్రీతి, స్త్రీ బతుకు బజారూ.. అలముకున్న ఈ దేశమెటు దిగజారూ..కాంచవోయి నేటి దిస్థితి.. ఎదిరించవోయి ఈ పరీస్థితి..పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ..ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం..సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..
పూర్తిగా చదవండి

ఎంత గొప్ప స్వాతంత్ర్యం!

Vartamaanam, english ఎన్.వేణుగోపాల్
ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టే మహోజ్వలపోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది?
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS