కొత్త సమస్యలు
కబుర్లు, తెలుగు పద్యం, తోటి బ్లాగర్లు August 14th, 2007
పులిని చూసి నక్క వాతలు పెట్టుకోడం.
కొత్తపాళీగారిని చూసి నేను పద్యాలు రాయడం.
రాసిన తర్వాత దురదకొద్దీ వాటిని బ్లాగడం.
పర్యవసానంగా ఊకదంపుడుగారు ఈ బాంబు పట్టుకొచ్చి నా బ్లాగులో పడేసారు. మిడతంభొట్లు మీ చేతిలో చిక్కేసాడండీ అని పేరు చెప్పి శరణు కోరడానికి అహం అడ్డు. ఏమిటి కర్తవ్యం?
పోరాడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. తప్పదు, మీరు భరించాల్సిందే!
సమస్య:
“గర్భముదాల్చెను పురుషుడు గంగలొ మునగన్”
నా పూరణ:
కం|| గర్భాదానపు తంతును
నిర్భీతిగ శంతనుండు నీటనె నెరపెన్
గర్భము పండగ గంగకు
గర్భము దాల్చెను, [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి