నాదు జాతి నాదు దేశము నాదు భాష
వ్యాసాలు August 14th, 2007డా// అద్దంకి శ్రీనివాస్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.
జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకుపోయేలా సృజన చేశారు. ఈ స్పృహ తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలం నుండే వచ్చింది. అంతకు ముందు సాహిత్యంలో ఈ స్పృహ ఉన్నప్పటికీ దాని లక్ష్యం, పరిధి వేరు. గురజాడ అప్పారావుగారి దేశభక్తి గేయం మొదలుకొని ఈ అభిమాన త్రయాన్ని బోధించే సాహిత్యమంతా ఒక ఉద్యమ స్ఫూర్తితో, చైతన్య దీప్తితో, సంస్కరణాత్మకమూ, ప్రబోధాత్మకమూ అయిన గమ్యం వైపే సాగింది. ఈ నేపథ్యం గల సాహిత్యంలో రాయప్రోలు వారు చెప్పిన మూడు అభిమానాలను స్పృశించడమే ఈ వ్యాసోద్దేశ్యం.
పూర్తిగా చదవండి
నాదు జాతి నాదు దేశము నాదు భాష -2
వ్యాసాలు August 14th, 2007కవి, సమాజం ఎన్నటికీ వేరు కాదు. రాసేది ధనుర్భంగమనే అంశమే అయినా, నాడు తన చుట్టూ ఉన్న ఉద్యమ స్ఫూర్తి కరుణశ్రీ ‘ఉదయశ్రీ’ కావ్యంలో ఎంత చక్కగా ధ్వనింపజేశాడో చూడండి.
“చెల్లరే విల్లువవిరుచునే నల్లవాడు
పది పదారేండ్లయెల రాచ పడుచువాడు
సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు
కనులు గుట్టిన తెల్ల మొగాల వారు”
“’నల్లవాడను’ పదమును భారతజాతీయ వీరునికి ‘తెల్లమొగాల వార’న్న పదమును ఇంగ్లీషు దొరలకు సంకేతముగా గ్రహింపవచ్చున”ని సినారె అభిప్రాయపడ్డారు.
పూర్తిగా చదవండి