చిన్నప్పటినుంచీ నేను ఎక్కువగా చదివిన వార్తాపత్రిక “ఈనాడు”. పత్రిక రాగానే మొదటి పేజీని ఒక చూపుచూసి వెంటనే వెనక్కి తిప్పి క్రీడా వార్తలు చదవడం నాకు అలవాటు. అప్పట్లో క్రికెట్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చే ఉండేది. దూరదర్శని మాధ్యమం ఇప్పట్లా అభివృద్ధి చెందలేదు కనక ఎక్కువగా వార్తలకోసం పత్రికల మీదే ఆధారపడేవాళ్ళం. “పీకల్లోతు కష్టాల్లో భారత్”, “భారత్ ఘోర పరాజయం” వంటి వార్తలే ఐనా ఎంతో ఆసక్తిగా చదివడం అలవాటయ్యింది అలాగే. అదే అలవాటున ఈరోజు పత్రిక [...]
పూర్తిగా చదవండి