నీళ్ళపై నడిచేవాణ్ణి చూసి, అడిగినాను “అలా ఎలా చెయ్యగలిగావు?” అని ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు. నిప్పు ముద్దలు తింటున్న వాణ్ణి చూసి, అడిగినాను “అలా ఎలా చెయ్యగలిగావు?” అని ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు. గాలిలో మేఘాలతో మాట్లాడుతున్నవాణ్ణి చూసి, అడిగినాను “అలా ఎలా చెయ్యగలిగావు?” అని ఓ చిరునవ్వు నవ్వి - తన దారి తాను చూసుకున్నాడు. నేడెవరో నన్ను పట్టుకొని అడుగుతున్నారు, “అలా ఎలా చెయ్యగలిగావు?” అని! ఓ చిరునవ్వు అప్రయత్నంగానే వెలుగు చూసింది.
పూర్తిగా చదవండి