- కాసుల ప్రతాపరెడ్డి లోపలివీ, వెలుపలివీ మనసు పొరల్లోకి ఇంకుతయి చెట్టుకు పూసిన పుష్పం ఈ దేహం వాడకుండానే రాలిపడాలె ఆత్మ ఒడ్డున పడ్డ చేప పిల్ల ఈ శాపమెప్పటిదో, ఎవరిదో ఊపిరాడక తన్నుకుంటూ ఉంటది నిన్నటికీ నేటికి ఎంత తేడా వాన చుక్కలు పెదవిని ముద్దాడుతుంటయి ఆరాటం, పోరాటం ఆశానిరాశాల ఊగిసలాట పొత్తు కుదరని తండ్లాట, తల్లడమల్లడం మనసు వేగాన్ని దేహం అందుకోదు ఈ నేలకు ఎందుకింత ప్రేమ ఆత్మనూ దేహాన్నీ మోస్తది కన్ను మూసుకున్నా పట్టని నిద్ర తొవ్వల మీద నెత్తురోడుతున్న పావురాలు మోదుగుచెట్టు ఒళ్లంతా పూలే ఎందుకొస్తామో, ఎందుకు పోతామో నేలతల్లి పచ్చి పుండు అయితనే వుంటది నీటి మీద [...]
పూర్తిగా చదవండి