- శిఖామణి రోజూ అవే అంకెల మీద తిరిగిన అంకెల మీదే తిరుగుతున్న గడియారంలోని ముల్లులా ఈ రోడ్ల మీద నా కొయ్యకాలు టక్… టక్… టక్… నగరం రద్దీలో నేను కాలు పోగొట్టుకోకమునుపే ఏ అడవో ఈ చెట్టును పోగొట్టుకుంది. అడవి అడవంతా వసంతోత్సవంతో నృత్యం చేస్తుంటే కుష్ఠురోగపు భర్తను నెత్తిన మోస్తున్న పతివ్రతలా నా కొయ్యకాలు నన్ను కావలించుకునే వుంది. చెవిటిదీ, మూగదీ, అవిటిదీ అని తెలియక రోడ్లు ఏవేవో చెప్తుంటాయి. పత్రికల్లో అందమైన కవిత్వం మధ్య తెల్ల మచ్చల గురించి నల్ల వెంట్రుకల గ్యారంటీ గురించి నరాల బలహీనతల గురించి అసహ్యమైన ప్రకటనల్లా అందమైన రోడ్ల మీద నా కొయ్యకాలు వికృతంగా కొందరిని భయపెడుతూ కొందరి జాలినీ సానుభూతినీ పొందుతూ… అర్ధరాత్రి కోర్కెలతో బరువెక్కిన నా దేహాన్ని ‘ఆ కాసేపూ’ భరించి నన్ను తేలికపరచే నా భర్య [...]
పూర్తిగా చదవండి