– కౌముది
కుండపోతగా కురుస్తున్న వెన్నెల్లో
నేను అభ్యంగనస్నానం చేస్తున్నాను
ఎన్నితరాల మురికో
మనసంతా పేరుకుంది
నేనిప్పుడు తేటతెల్లని మనిషిని కావాలి

పేరుకుపోయిన మురికిని
అలంకారాలుగా ధరిస్తున్న మనిషిని
నేనిప్పుడు దిగంబరుడ్ని చేయాలి
నాకు నీడనిస్తానన్న పొన్నచెట్టొకటి మోడుబారి
మాటతప్పిన ప్రియురాల్లా మౌనంగా తలదించుకుంది
వచ్చే వసంతానికైనా కొత్తగా చిగురిస్తుందో చూడాలి
ఈ వెన్నెట్లో
ఆ చెట్టుమీదే
నా మనసారేసుకున్నాను
తుప్పుపట్టిన బంగారుపంజరంలో
మనసును బంధించుకున్న మనిషిని
నేనిప్పుడు స్వేచ్ఛా ఆకాశంలోకి గిరగిరా తిప్పి విసిరేయాలి
మనుషుల్ని – మనసుల్ని ధ్వంసం చేస్తున్న
ఈ విధ్వంసక విలువల ముఖమ్మీద
నేనిప్పుడు కాండ్రించి ఉమ్మేస్తున్నాను
కుండపోతగా కురుస్తున్న నెత్తుట్లో
నేనిప్పుడు తుపాకీట్రగ్గర్ పై
చూపుడువేలు బిగిస్తున్నాను
ఎన్నితరాల యుద్ధమైనా [...]


పూర్తిగా చదవండి