- చలసాని ప్రసాద్ మనసు మూగబోయింది… సహవాసి అస్తమించాడు. మనసు మూగబోయింది. అంతరంగం అంధకార బంధురమైంది. గుండెల్లో సుడిగుండాలు చెలరేగాయి. “O! death! death to a dove ” అన్నాడో ఇంగ్లీషు కవి. ‘ఏ నాటికైనా మానవజాతి మరణాన్ని జయిస్తుంది’ అన్నాడు మన మహాకవి. అందాకా ఈ వేదన మనని వీడదు. నిజం చెప్పాలంటే సహవాసి నాకన్నా రెండేళ్లు చిన్న. అయినా తాను ముందుగానే సెలవంటూ వెళ్లిపోయాడు. ఎందుకని? ఏమో చెప్పలేం! దిగులు చెందడం మానలేం. [...]
పూర్తిగా చదవండి