Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఫైళ్లు డిలీట్ అవడం లేదా?

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ నుండి అనేక వైరస్ లు, స్ఫైవేర్లు, డయలర్ ప్రోగ్రాములు, బ్రౌజర్ హైజాకర్లు మన సిస్టంలోకి ప్రవేశించి మనకు తెలియకుండానే కొన్ని ఫైళ్లని Windows\System32 వంటి కీలకమైన ఫోల్డర్లలో దాచిపెడుతున్నాయి. సహజంగా ఆయా సిస్టం ఫోల్డర్లలో ఆపరేటింగ్ సిస్టంకి అతి ముఖ్యమైన ఫైళ్లు భధ్రపరచబడి ఉండడం వల్ల ఎవరూ ఆ ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేయడానికి సాహసించరు అని వైరస్ రూపకర్తల అభిప్రాయం. అయితే
పూర్తిగా చదవండి

Word’s worth millions!

Self development /inspiration Carani Narayana Rao
ANU GARG, 40 By Ajay Uprety Believe it or not. Words are money. Anu Garg, 40, became a millionaire by selling English words. Here's how. Garg grew up in a humble family in the nondescript village of Khakrauda in western Uttar Pradesh. He went to village schools and did not learn English until Class six. But that was enough to develop in him a fascination for words. Says his sister Mamta Agrawal:
పూర్తిగా చదవండి

సిస్టం ఎందుకు షట్ డౌన్ అవడం లేదు?

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
విండోస్ ఆపరేటింగ్ సిస్టంని ఉపయోగించే పలువురు యూజర్లు తమ కంప్యూటర్ ని షట్ డౌన్ చేసేటప్పుడు అన్ని ప్రోగ్రాముల్నీ క్లోజ్ చేసినా సిస్టం షట్ డౌన్ అవడం లేదని Ctrl+Alt+Del కీలతో బలవంతంగా రీస్టార్ట్ చేయవలసి వస్తోందని వాపోతుంటారు. దీనికి కారణాలు విశ్లేషిద్దాం. మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంని బూట్ చేసినప్పుడు విండోస్ కి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, డివైజ్ డ్రైవర్లు, ఇతరత్రా ప్రోగ్రాముల స్టార్టప్ ఫైళ్లు
పూర్తిగా చదవండి

ఝుమ్మంది నాదం-2, వెనక్కొచ్చిన వాచీ, ఓ వింత సీరియల్

At Random vbsowmya
అమ్మో అమ్మో…వారమౌతోంది నేను బ్లాగి! మరీ ఇలాగైపొయినాదేటి జీవితం? శనివారం రాత్రి జానకి గారితో ఝుమ్మంది నాదం రెండో భాగం వచ్చింది. ఇది కూడా చాలా బాగా ఉండింది. జానకి గారి ఉత్సాహం, గలగలమంటూ నిండుగా ఆవిడ నవ్వే ఆ నవ్వు, వింటూ ఉంటే మాయ చేసి ఆవిడ పాటల లోకం తప్ప మరోలోకం లేదని నమ్మింపజేసే ఆ గాత్రం… ఇవన్నీ ఉండగా ఆ ప్రోగ్రాం బాగుండక ఎలా ఉంటుంది చెప్పండి? అయితే, మరీ [...]
పూర్తిగా చదవండి

Very nice site, indeed.

వార్తలు chavakiran
http://home.hetnet.nl/~ex-baba/engels/movies.html 
పూర్తిగా చదవండి

Telugu sunshine
LEELA MADHAV: naa kodaka system lo loops vadukuntavv..malli pedda socialist laa act chestav....nuvvu pseudo socialist ra...nuvvu pedda tussu gadivi.... రవి తేజ: system meeda nammakam lenappudu .... system ni enduku khatar cheyyali raA?ee sy...
పూర్తిగా చదవండి

The Telugu Paradigm. Understanding VASAT, The Illiterate’s Internet

Telugu v_tel001
An article by Frank A. Hilario
పూర్తిగా చదవండి

కొయ్యగుర్రం - నగ్నముని

కవితలు ప్రజాకళ
జీవితం మిధ్య అనడం అబద్ధం ఎంగిలి మెతుకులేరుకుని ఎలక్ట్రిక్ తీగల మీదా ఇళ్ళ కప్పుల మీదా జంతు కళేబరాల మీదా ‘అలగాజనం’ పుళ్ళ మీదా పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే మిధ్య గూర్చి కావుకావుమంటూ ప్రవచించగలవు మానవత్వం బతికి వుందనడం అబద్ధం కప్పుకోవడానికి మేక చర్మాల కోసం తిరిగే మెకాలు మాత్రమే నీతి వాక్యాలు వేదికల నుంచి ఉపన్యసించగలవు విశ్వశ్రేయం కావ్యం అని అరుస్తూ ప్రబంధ నాయకి తొడల బంధనాల్లో పాదాలకు పూసుకుని ఎగిరే లేపనాల్లో అంటుకున్న కవిత్వం అబద్ధం తపస్సు చెయ్యడానికి వెళ్ళవలసింది హిమాలయాల్లోకి కాదు జనం లోకి పరిత్యజించవలసింది సంసారబంధం కాదు స్వార్దాన్ని ఓంకారం కాదు ఆర్తనాదమే జీవికి అన్ని [...]
పూర్తిగా చదవండి

కలత - నందిని సిధారెడ్డి

కవితలు ప్రజాకళ
తప్పిన అడుగుల్లో తలలు నాటుతున్నాం కంటున్న కల పూర్తికాకుండానే దబుక్కున మెలకువొస్తుంది ఇక్కడేదో హార్మోనియం పెట్టె పగలినట్టు శృతి విరిగిపోయింది జానపదగీతం వినెతందుకు జన్నభూమి మొరాయిస్తున్నది ఊగిసలాటలో ఉడుకుతున్న జీవితం చావువాసన సంతరించుకుంటున్నది వానజల్లులు జల్లులుగా కురిసినా మునుపటి వలె నేల పులకించటం లేదు పాతనవి మొక్కలు కాదు రాతికనీలు వసంతం అడుగిడినా అవి చిగురించవు తప్పిన దారుల్లో కలలు వెదజల్లుతున్నాం అష్టభుజి సందడిలో ఉన్నభూజాలు పోతాయి నిర్వాసితుల కన్నీళ్ళు కంప్యూటర్ ను చెమరించలేవు నిండు సభలో మనిషి శిరచ్ఛేదాన్ని ఆపెతందుకు ఎవరూ ముందుకు రారు అందరిదీ ఒకే తల నమ్రంగా నాలుక తిప్పటమే ఇ-కళ దూప తీరకముందే నది అదృశ్యం ఎక్కక ముందే కొండ అదృశ్యం విషాదాలు మోసెతందుకయినా తలలుండాలె వివేచన చేసెతందుకయినా తలలుండాలె ఎవల భుజాల మీద వాళ్ళ తలలే ఉండాలె
పూర్తిగా చదవండి

సముద్రం: మొదటిభాగం - వరవరరావు

కవితలు ప్రజాకళ
నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ నా టెలివిజన్ కన్నుల్లో విను నా మనసు మీద చెవి పెట్టి చూడు నేనే క్యాసెట్‌నై రికార్డ్ చేసుకొని వచ్చిన సముద్రం సంభాషణను విను నా రక్తం ప్రతిధ్వనిస్తున్న సముద్ర నిశ్వాసాన్నీ నా ఊపిర్లు ప్రతిస్పందిస్తున్న సముద్ర విశ్వాసాన్నీ విను నా పాటయే మనిషయి ప్రతిఫలిస్తున్న సముద్రం నిన్నూ నన్నూ ఆవహించనీ ఎంత దూరం నుంచి నడచి వచ్చానో సముద్రాన్ని చూడాలని. అడవినై ఆకుపచ్చ సముద్రం కోసం ఆక్రోశించాను. గుహనై సముద్రం చీకటి లోతులలో వెతకడానికి నెత్తుటిలోని వెలుగునంతా కళ్ళల్లోకి తెచ్చుకున్నాను. కొండనై తల ఎత్తిచూసి నదినై పరుగెత్తికొచ్చాను. ఎన్ని యుగాలనుంచి ఎన్ని తరాలనుంచి ఎన్ని దశలు ఎన్ని అవస్థలు, ఎన్ని [...]
పూర్తిగా చదవండి

సముద్రం: రెండవ భాగం

కవితలు ప్రజాకళ
- వరవరరావు సముద్రం ఘోష నన్నుతాకి కన్నీటితో కడిగింది నా ముందు తాను నురుగై కరిగిపోయింది కెరటమై విరిగిపోయింది కెరలి కెరలి తిరిగిపోయింది అలలు అలలుగా తిరిగివచ్చి నా మనసులో ప్రవహించి సముద్రం నన్ను స్నేహంలో ముంచెత్తింది. నా శరీరానికి జర జర పాకుతూ మెత్తగా జారే స్పర్శయి నా కళ్ళకు వెలుగుచీక ట్ల ఆకాశమై అగాధమై అనంతకోటి నక్షత్ర స్థగిత క్షతగాత్రమై భయమ గొలిపే సౌందర్యమై ఆకాశం తెరచాపగా గాలి చుక్కానిగా లావణ్యం లైట్‌హౌజ్‌గా తానే ప్రకృతి ఎల్లవేళలా తెరచివుంచిన ఆర్ద్రనయనమై నిద్రలేని నిరంతర పయనమై నిర్దేశిస్తున్నది నన్ను సముద్రం నేను అలనంటి పరుగెత్తుతున్నానో నా రక్తంలో తరంగాలు అగ్ని స్వప్నాలై రూపుకడుతున్నాయో అనుభూతి సముద్రమవుతున్నది అనుశ్రుతి సముద్రమవుతున్నది సముద్రం నా హసనమయింది రసన [...]
పూర్తిగా చదవండి

వేలెత్తి చూపడం

Telugu మేధ
మొన్న శనివారం ఈనాడులో వచ్చిన “మనసులో మాట” చదివాను (అది ఇక్కడ చదవండి) మొదట అతనంటే జాలి వేసింది.. ...
పూర్తిగా చదవండి

రాలిపోవాలని ……

కవితలు ప్రజాకళ
- పసునూరి రవీందర్ నాయిన ఎద్దుల బండి పోయిందని కాదు, నాయినే పోయిండని ఈ బాధ. లాభం జరిగినోనికి మోసం కూడ రంజుగ, పసందుగనే తోస్తది. కానీ…… పూటకొక్క మెట్టు దిగజారుతున్నోడికే ఎరుక కుట్రెంత బేజార్ చేస్తదో, మోసమెంత మొదలారుస్తదో! దుక్కి దున్నిన నాగలి కర్రుకు ఉరితాడు పేనిందెవడు? తిండిగింజలొదిలి వ్యాపార పంటల ఆశరేపిందెవడూ? అయినా…, మనుషుల్ని మాయంజేసినోడీకి మట్టిని మాయంజేసుడొక లెక్కా! ఊళ్ళు ఖాళీ చేసి, శ్మశానాల్ని అభివృద్ది చేయడం వాడి కల. పాణాల్ని పాతరేసినోడు ఇయ్యాల భూమ్మిద కన్నేసిండు. కనురెప్పలు మూయకుండనే కాళ్ళ కింది నేలను ఖతం చేస్తున్నడు. వాడికి చరిత్ర తెలియదుగానీ, కూసున్న కొమ్మను నరుకున్నోడెవడైనా …. కూలిపోతాడని, రాలిపోతాడని……
పూర్తిగా చదవండి

స్త్రీలు,దళితులు,మైనారిటీలు,బహుజనులు చరిత్రలో జరిగిన జరుగుతున్న అన్యాయానికి బదులు అడుగుతారు. - కొండేపూడి నిర్మల ఇంటర్వూ

ఇంటర్‌వ్యూలు ప్రజాకళ
నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఒక కవయిత్రిగా స్పందించి, స్పష్టమైన భావాలతో, సరళమైన భాషలో, భావోద్వేగం తో కవిత్వం రాస్తారు, కొండేపూడి నిర్మల. జనం మాటలలో, స్వచ్ఛమైన తెలంగాణ పల్లె మాండలికం లో కవిత్వాన్ని అల్లుతారు. “ఎన్ని మందుల సల్లినా సేను కొరికే పురుగు బతుకుతాంది, ఎన్ని ఎలచ్చన్లు మారినా దేశం కొరికే సర్కారు బతుకుతాంది” అని ధిక్కారంగా, ధైర్యంగా కఠిన వాస్తవాలను చెబుతారు.ఇప్పటిదాకా సంధిగ్ధ సంధ్య (1988), నడిచే గాయాలు [...]
పూర్తిగా చదవండి

ప్రాణుల లక్షణాలు, మనుషుల భ్రమలు

వ్యాసాలు ప్రజాకళ
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ మనుష్యులు తక్కిన జంతువులతో పోలిస్తే అసాధారణ జీవులే. మనుష్యుల ప్రత్యేక లక్షణాలకు వారి మెదడూ, బాగా పరిణతి చెందిన నాడీ వ్యవస్థా ముఖ్యకారణాలు. ఈ ప్రత్యేక లక్షణాల్లోనే కొన్ని తప్పుడు నమ్మకాలకూ, భ్రమలకూ కూడా దారితీస్తున్నాయి. ప్రకృతిలో ఒక భాగంగా కాక, తనను ప్రత్యేక సృష్టిగా, మొత్తం ప్రాణికోటికి పరాకాష్ఠగా భావించే మనిషి అసలు ఎలా పరిణామం చెందాడో తెలిస్తే జీవరాశిని గురించిన సరైన అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS