తాంత్రిక శాస్త్రం చదువుకునే రోజుల్లో మా కళాశాల విద్యార్ధులందరికీ గౌతమ బుద్ధుడు ఆదర్శం. నిజమైన జ్ఞానం చెట్టుకిందే లభిస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళం. అందుకే ఎక్కువ సమయం కళాశాల ఆవరణలో మా విభాగపు భవనానికి ఎదురుగా ఉన్న చెట్టుకింద గడిపేవాళ్ళం. అలా చెట్టుకింద కూచుని జ్ఞానం కోసం ఎదురుచూసే రోజుల్లో మేము కాలక్షేపంకోసం చేసే పనుల్లో ముఖ్యమైనది Dumb Charades   (మూకాభినయం) అనే ఒక ఆట. దానికోసం ఎక్కడెక్కడ కష్టమైన సినిమాపేర్లూ వెతికి సంపాదించడం, వాటిని అమ్ములపొదిలో సిద్ధంగా ఉంచుకోడం మాకు అలవాటుగా [...]
పూర్తిగా చదవండి