సినిమా తీయడం ఎలా?-వాంగ్ కర్-వై ని అడుగుదాం
cinema, english, తెలుగు, సినిమా September 12th, 2007
అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మన వాళ్ళు తీసే సినిమాలు అంతగా బాగోలేకపోయినా చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్న మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విష్యాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యున్నత సినిమాలను స్టడీ చేయడం ద్వారా ఫిల్మ్ లాంగ్వేజ్ ను బాగా తెలుసుకోవచ్చు. ఒక్క సారి ఫిల్మ్ లాంగ్వేజ్ పై బాగా పట్టు సాధించాక అందులో ఎన్ని ప్రయోగాలయినా చేయొచ్చు. మనకంటూ ఒక భాషను సృష్టించుకోవచ్చు. అలా తమ కంటు ఒక శైళిని సృష్టించుకున్న దర్శకులు చాలా తక్కువ మందే వున్నారు. అదీ మన దేశంలో మరీ తక్కువ.
ఇలా తమకంటూ ఒక భాషను రూపొందించుకున్న దర్శకుల్లో నాకు గుర్తొచ్చేది ఒక హాంగ్ కాంగ్ దర్శకుడు. హాంగ్‌కాంగ్ సినిమా అనగానే హీ...హూ అంటూ సాగే కుంగ్‌ఫూ సినిమాలే గుర్తుకొస్తాయి ఎవరికైనా. కానీ నాకు తెలిసినంత వరకూ హాంగ్‌కాంగ్ సినిమాకు వన్నె తెచ్చిన దర్శకుల్లో ముందుగా గుర్తొచ్చే పేరు వాంగ్ కార్-వై.
పూర్తిగా చదవండి