పొగ తాగని వాడు వచ్చే జన్మలో దున్నపోతై పుడ్తాడో లేదో తెలియదు కానీ, కర్నాటక సంగీతం వినకపోతే మాత్రం వచ్చే జన్మలో తప్పక గొర్రెగా పుడ్తారు; ఎందుకంటే వినని వాళ్ళు ఈ జన్మలోనే గొర్రెలు కనుక. వినని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే వుంటుందని తెలుసు. కానీ మన సంగీతాన్ని మనమే వినకపోతే ఎలా? అందుకే కొంచెం గట్టిగా చెప్తే అయినా వింటారేమో అని....
పూర్వజన్మలు, పునర్జన్మలు , గొర్రెలు, దున్నపోతుల సంగతి పక్కన బెట్టి సంగీతం విషయానికి వస్తే ఒకప్పుడు నేనూ చాలా మంది లాగే కర్నాటిక్ సంగీతమంటే కర్ణకఠోరంగా వుంటుందని ఫీల్ అయిపోయేవాడిని. అదృష్టవశాత్తూ సరైన వాళ్ళు సరైన సమయంలో పరిచయమయ్యి నా కళ్ళు తెరిపించారు.
పూర్తిగా చదవండి