మరల మరల పునరంకితం
పాత పాటలు September 14th, 2007కొన్ని అనివార్య కారణాలు, పరిస్ధితుల వలన చాలా కాలం నుంచి ( సుమారు 3 నెలల నుంచి) ఏ టపాలు వేయలేక పోయాను. ఈ రోజే అంతర్జాలం తెరచి ముందుగా తెలుగు గుంపులోని వందలాది లేఖలను చాలా ఓపికగా ( లేకపోయినప్పటికీ, ఎరువు తెచ్చుకుని మరీ) చదివా. పనిలో పనిగా Blog Statistics కూడా చూసా. ఆశ్చర్యం !!! ఈ మూడు నెలలలో కూడా నా బ్లాగు సందర్శకులు వస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. పాటలు వింటూనే ఉన్నారు.
నేను ఒక్క పోస్టూ చేయని/చేయలేక పాయిన జూన్, జూలై, ఆగస్టు, ఇప్పటి వరకూ సెప్టెంబరు నెలల గణాంకాలు ఇలా ఉన్నాయి.
జూన్ - 152 సందర్శకులు
జూలై - 184 సందర్శకులు
ఆగస్టు - 184 సందర్శకులు
సెప్టెంబర్ - 119 సందర్శకులు ( ఇవాళ్టి వరకు)
అందుచేత ఒక కఠినాతి కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. అదేమిటంటే, ఓపిక ఉన్నా లేకపోయినా కనీసం వారానికి ఒక పోస్టయినా తప్పకుండా చేయాలని. అలాగని అల్లాటప్పా పోస్టులు కూడా చేయలేనీి పరిస్ధితి.
అందువలన ఎటువంటి పోస్టులు కావాలో చదువరుల నిర్ణయానికే వదిలేసి వారి నిర్ణయానుసారం పోస్టులు చేయాలని అనుకుంటున్నా.
మీ సూచనలు, సలహాలు, కోరికలు తప్పకుండా తెలియ చేస్తారని ఆశిస్తున్నా.
మరల మరల పునరంకితం ( ఈ బ్లాగుకి) అవుతున్న సందర్భంగా ఒక హిందీ పాటను వేస్తున్నా.
నేడే, ఈనాడే కరుణించె నన్ను నెటిజనులే …..
పూర్తిగా చదవండి