కర్ణాటక సంగీతం ఖచ్చితంగా విని తీరాల్సిందే లేకపోతే మీరు మన సంస్కృతికి పెద్ద అన్యాయం చేసినట్టే. కాకపోతే చాలా మందికి ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక, సరిగ్గా guide చేసే వాళ్ళు లేక కొంచెం కష్టాలు పడుతుంటారు. నేనూ మొదట్లో ఇలాంటి తిప్పలే పడినా ఇప్పుడు పరిస్థితి కొంచెం మేలయ్యింది.అందుకు చాలానే కారణాలున్నాయి. 1)అంతర్జాలం లో కర్ణాటిక్ సంగీతం గురించి వున్న వ్యాసాలు 2)www.musicindiaonline.com లో వున్న సంగీత సంపద 3)నా శ్రీమతికి కర్ణాటక సంగీతంలో మంచి ప్రవేశం వుండడం 4)పిల్లనిచ్చిన మామ గారు కర్ణాటక సంగీతం గురించి సమీక్షలు, విశ్లేషణలు రాయడం 5)అన్నిటికంటే ముఖ్యంగా మంచి సంగీతం వినాలన్న తపన
పూర్తిగా చదవండి