మైక్రో ప్రాసెసర్ (micro processor)
కంప్యూటర్ September 26th, 2007
కొన్ని IC ( ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్) లు కలిసి మైక్రో ప్రాసెసర్ గా ఏర్పడుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ గణిత పరిక్రియలను చేయగలుగుతుంది. దానికిచ్చే ఆదేశాలను అర్థం చేసుకోగలుగుతుంది. మైక్రో ప్రాసెసర్ తార్కిక నిర్ణయాలు కూడా తీసుకోగలదు. ఈ పనులన్నీ చేయడానికి దానికి నివేశ సాధనం ( input device) కావాలి. నివేశ సాధనం ద్వారా దానికి కావలసిన దత్తాంశం ( data) ఆదేశాల ( instructions) ను ఇవ్వాలి. సాధారణంగా, ఒక కీ- బోర్డు
( key-board) లేదా మౌస్ ( mouse) లను నివేశ సాధనాలుగా ఉపయోగిస్తారు.
నివేశ సాధనం ద్వారా అందించే దత్తాంశం రెండు రకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి విద్యార్థులు, వివిధ విషయాలలో పొందిన మార్కులను తీసుకుందాం. దీని నుండి తరగతి మార్కుల సరాసరి శాతాన్ని గణించవచ్చు. ఇక్కడ " దత్తాంశం" ( data) మార్కులు. ఈ దత్తాంశాన్ని " సంఖ్యాత్మక ( numeric)- దత్తాంశం" అంటారు. కొన్నిసార్లు, విధ్యార్థి పేరు, క్రమసంఖ్య, చిరునామాల వంటి సంఖ్యాత్మకం కాని ( non- numeric) దత్తాంశాలు కూడా అవసరమౌతాయి. ఈ విధంగా సరఫరా చేయాల్సిన దత్తాంశాలు సంఖ్యాత్మక, సంఖ్యాత్మకం కానివిగా రెండు వర్గాలున్నాయి.
ఇచ్చిన ఆదేశాల మేరకు, దత్తాంశం కార్యసరణమౌతుంది ( processed). ఆదేశాల సముదాయాన్ని
ప్రోగ్రాం ( program) అంటారు.
మైక్రో ప్రాసెసర్ లో " కంట్రోల్ యూనిట్"( CU) అనే ఒక సాధనం ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్ పంపే సంకేతాలను డీ కోడర్ ( decoder) అనే సాధనం అర్థవివరణ ( interpret) చేస్తుంది. దీనిలో, దత్తాంశాన్ని, ప్రోగ్రాం ను తాత్కాలికంగా నిలువ చేసేందుకు మెమో రి ( Memory) అనే రెండవ సాధనం ఉంటుంది. మైక్రో ప్రాసెసర్ లోని చివరి సాధనం అరిథ్మేటిక్- లాజిక్- యూనిట్ ( ALU). అన్ని రకాల గణిత, తార్కిక, సంబంధ గణనలన్నింటిని ALU చేస్తుంది. ఎప్పుడైతే, ఈ గణనలన్నీ పూర్తి అవుతుందో, అప్పుడు, ఫలితాలను " నిర్గమ సాధనం" ( output device) నకు పంపబడతాయి . సాధారణంగా ఒక ప్రింటరు ( printer) లేదా మానిటరు ( monitor) అనే సాధనాలు ఈ సాధనాలుగా ఉపయోగపడతాయి.
ఆ విధంగా మైక్రో ప్రాసెసరులో మూడు సాధనాలుంటాయి. ( i) కంట్రోల్ యూనిట్,( ii) మెమొరీ, ( iii) అరిథ్మేటిక్- లాజిక్- యూనిట్. ఈ మూడింటిని కలిపి ప్రధాన కార్యసరణ భాగం ( Central Processing Unit, CPU) అంటారు.
పూర్తిగా చదవండి
(
నివేశ
ఇచ్చిన
పూర్తిగా చదవండి