రాలిపోవాలని ……
కవితలు September 30th, 2007
- పసునూరి రవీందర్
నాయిన
ఎద్దుల బండి పోయిందని కాదు,
నాయినే పోయిండని
ఈ బాధ.
లాభం జరిగినోనికి
మోసం కూడ
రంజుగ, పసందుగనే తోస్తది.
కానీ……
పూటకొక్క మెట్టు
దిగజారుతున్నోడికే ఎరుక
కుట్రెంత బేజార్ చేస్తదో,
మోసమెంత మొదలారుస్తదో!
దుక్కి దున్నిన
నాగలి కర్రుకు ఉరితాడు పేనిందెవడు?
తిండిగింజలొదిలి
వ్యాపార పంటల ఆశరేపిందెవడూ?
అయినా…,
మనుషుల్ని మాయంజేసినోడీకి
మట్టిని మాయంజేసుడొక లెక్కా!
ఊళ్ళు ఖాళీ చేసి,
శ్మశానాల్ని
అభివృద్ది చేయడం వాడి కల.
పాణాల్ని పాతరేసినోడు
ఇయ్యాల భూమ్మిద కన్నేసిండు.
కనురెప్పలు మూయకుండనే
కాళ్ళ కింది నేలను
ఖతం చేస్తున్నడు.
వాడికి చరిత్ర తెలియదుగానీ,
కూసున్న కొమ్మను
నరుకున్నోడెవడైనా ….
కూలిపోతాడని,
రాలిపోతాడని……
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి