మొగోళ్ళు - మొగుళ్ళు
హాస్యం October 14th, 2007ఈ మధ్య విశ్వవ్యాప్తంగా కొద్దోగొప్పో డబ్బున్న మగాళ్ళు అదే మొగుళ్ళు తమతమ భార్యల్ని తెగ ప్రేమించేస్తున్నారు. అలా ఇలా కాదు, బంగారంతో.. జ్యోతి గారు చెప్పిన టైపు మొగుళ్ళు కూడానూ! బంగారం దొరకటమే గగన మయ్యేంతగా భార్యల మెళ్ళో కిలోల లెక్కన దింపేస్తున్నారు..
కాస్త తరచిచూస్తే, పడిపోతున్న ఈ కరెన్సీ విలువల రోజుల్లో, డబ్బుని మరింత పెంచుకోవటానికి బంగారాన్ని మించిన వస్తువేముందని మొగరాయళ్ళు ఈ ప్లాన్ వేశారు. తమ సొత్తుని సర్వశక్తులు ధారపోసి రక్షించుకునే మన వనితలు అపర రాణి రుద్రమలూ, ఝాన్సీ రాణులే కదా. దివాలా తీసే బాంకుల్లోని సేఫ్ డిపాజిట్ లాకర్ల కన్నా 100% బెటరే కదా!
అన్నిటినీ మించి పుణ్యం పురుషార్థమూనూ, ఒక్క దెబ్బతో డబ్బుకు డబ్బూ సేఫ్, పెళ్ళాల ప్రేమా సేఫ్… సేఫేమిటీ, సూపరు సేఫ్ కాదూ.
చూశారా, రెచ్చిపోతే మొగుళ్ళు ఎలా ప్రేమించేస్తారో, చీపుగా ఉత్తుత్తి ప్రేమతో కాదు,… బంగారు ప్రేమతో.. అందుకే అలా రెచ్చగొట్టకండి జ్యోతి గారూ మా వాళ్ళని, వాళ్ళ ప్రేమని..
**************************************************************************
మామూలుగానే ఆడవాళ్ళకు షాపింగ్ రెండో మొగుడు కదా. మా శ్రీమతీ అందుకు అతీతమేమీ కాదు. మామూలుగా కొంటునే ఉన్నవి కాక, ఓ రోజు …
ఇవ్వాళ గొప్ప అమ్మకం తగ్గింపు ధరలకు, అన్న పేపర్ చూపించి, వేటకి వెళ్ళటానికి సిద్దమయింది.
ఓ క్షణం అది చూసి నేను విచిత్రంగా నవ్వా!
ఏంటీ మీకేమైనా పిచ్చా లేక వెటకారమా, నే చూపిచ్చిన దాన్లో తప్పు ఏముంది అంది కోపంగా?
తాపీగా, నువ్వే చదువు ఆ కాగితంలో ఏమని రాసాడో అన్నా?
ఏముందీ “మెగా సేల్” తగ్గింపు అంటున్నాడు అంది..చిర్రు బుర్రుగా..
ఓ మైడియర్, వాడంటున్నది కేవలం నేను “అమ్ముతున్నాను” అని మాత్రమే …
ఆహా, మరయితే మిగతా రోజుల్లో నేను చేసేదేమిటో…?
కొనటమమ్మా కొనటం. అక్కడే ఉంది తిరకాసు, నువ్వు కొనటమూ, వాడు అమ్మటం రెండు వేర్వేరు సంగతులమ్మా అన్నాను. నీకుగా నువ్వెళ్ళి కొంటే, అది వాడికి ఖర్చు పెట్టకుండా జరిగే బిజినెస్సు.అలాంటి పరిస్థితి లేనప్పుడే, నేను “అమ్ముతున్నాను” అంటాడమ్మా !నీకుగా నువ్వెళ్ళి “కొన్నా”, వాడు “అమ్మినా” ఫలితం ఒకటేనే పెళ్ళామా. ఊడేవి మన పళ్ళే …
ఛా ఛా, నన్ను తెగ కంఫ్యూజ్ చేశేసారు, మీకికెప్పుడూ నా షాపింగ్ సంగతులు చెప్పకూడదు అంటూ, నేను కొనడం …. వాడు అమ్మటం …..నేను కొనడం …. వాడు అమ్మటం …నేను కొనడం …. వాడు అమ్మటం ……. అనుకుంటూ ఇంట్లోకి నడిచింది…..
నేను ముసిముసిగా నవ్వుకుంటు విశ్రమించా…
***************************************************************************
మా బంధువులు మా ఇంటి దగ్గర్లోనే ఉంటారు. ఓ రోజు మా స్నేహితుడు, మా ఇంటికి వచ్చి మాటల సందర్భములో..
మీరు బాగా క్లోజ్ కదా అన్నాడు..
అవునవును బాగా.. పిచ్చ క్లోజ్ (CLOSE) ఇప్పుడిప్పుడే ఓపెన్ (OPEN) అవుతున్నామురా అన్నా..
వాడికి విషయం అర్థమయ్యిందనే అనుకుంటా..
పూర్తిగా చదవండి