ఆగిపొయిన గుండెను,
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు October 16th, 2007
ఆగిపొయిన గుండెను,
మెత్తని కత్తితో కదిలిస్తూ,
ధబ్ ధబ్ మని మళ్ళా -
అన్పించాలని చూస్తున్నావు.
మూగబొయిన గొంతులొ,
అమృతం పోసి,
ఆలాపనలు మళ్ళా -
చేయించాలని చూస్తున్నావు.
విరిగిపొయిన రెక్కలకు,
ఇనుప తొడుగులు వేసి,
విహారాలను మళ్ళా -
చేయించాలని చూస్తున్నావు.
నే విసిరేసిన రాళ్ళను,
నా చుట్టూనే పరిచినావు.
నీకై తొలి అడుగు వేసి వస్తున్నాను.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి