ఆశించినవి దక్కకపోవడం, కోరికల సాధనలో విఫలం
మమతానురాగాలు, అప్యాతానుభవములు లోపించడం
అనుమానం, అసూయ, ఆగ్రహం వంటి దుర్లక్షణములు
జీవితంలో మనల్ని అశాంతికి గురి చేయు సాధనములు
కోరికలు త్యజించడం శాంతికి తొలొ సోపానం
పెడత్రోవ పట్టి మనస్సును కల్లొలపరిచే
బుద్ధి నియంత్రణ ఆధ్యాత్మిక జీవనానికి మలి సోపానం
హృఇదయ శుద్ధి లేని స్త్రోత్రాలు,
ఆడంబరమైన పూజలు ఆధ్యాత్మికం కాదు
శత్రువులను కూడా ఉపకారమొనరించడం
పరుల హితాన్ని సమాజ శ్రేయస్సును సదా కాంక్షించడం
సర్వ జీవుల పట్ల సమత్వ భావన కలిగి వుండడం
పరిపూర్ణమైన నిజమైన అధ్యాత్మికతకు నిర్వచనం
అహింస, ధర్మాచరణ, సత్సంగం,
మధుర భాషణం, సత్కర్మల ఆచరణ
మన జీవితంలోను, తద్వారా సమాజంలోనూ
శంతి కుసుమాలను వెదజల్లుతాయి.
పూర్తిగా చదవండి