పరోపకార పుణ్యాయ
పాపాయ పరపీడనం అన్నది ఆర్యోక్తి
నితంతరం అప్రమత్తతో
మెలగడమే అసలు విజయ రహస్యం
అజాగ్రత్త అపజయానికి సోపానం
పరోపకారమే లక్ష్యంగా బ్రతికే
మానవుడికి అమరత్వం సాధ్యం
రాళ్ళ దెబ్బలు తిన్నా
తియ్యని ఫలాలను అందించే చెట్లు
అలుపెరగక నిరంతరం ప్రవహిస్తూ
దేశాన్ని సస్య శ్యామలం చేసె జీవ నదులు
ఔషధం లాంటి కమ్మని
పాలను ఎల్లెడలా ఇచ్చే గోమాత
పరోపకార తత్వానికి
చక్కని నిదర్శనములు
అజాగ్రత్తను వీడి అనుక్షణం
అప్రమత్తతో మెలుగుతూ
పరోపకారం అనే దివ్య పధంలో
ప్రయాణం సాగిస్తే
మానవుని జీవితం అవుతుంది సార్ధకం
అటువంటి సార్ధక నామధేయుల
వలన సమాజం వర్ధిల్ల్తుంది
పూర్తిగా చదవండి