ఆకురాలు కాలం
కవిత్వం, ప్రకృతి, మాటలు November 4th, 2007కార్తీక మాసపు పేరంటాలకి వెళ్ళడానికి రంగు రంగుల పట్టుచీరలు కట్టి ముస్తాబవుతున్న ముత్తైదువల్లాగా చెట్లన్నీ సింగారించుకుంటున్నాయి. ఈ క్షణంలోని అందాన్ని అనుభవించి ఆనందించలేని నేనేమో .. అయ్యో ఇంకొన్ని రోజుల్లో ఇవన్నీ మోడులైపోతాయి గదా అని విచార పడుతుంటాను.
పాశ్చాత్యులకి నాలుగే ఋతువులు .. స్ప్రింగ్, సమ్మర్, ఆటం, వింటర్ .. వెరసి ఫోర్ సీజన్స్. వివాల్డి అనే వెనీషియన్ తుంబురుడు ఆ పేరిట ఒక అద్భుత సంగీత మాలికని రచించి ప్రకృతిమాతకి అలంకరించాడు. స్ప్రింగ్ అంటే వసంతం, సమ్మరంటే గ్రీష్మం లేదా వేసవి, వింటరంటే చలి కాలం. గొడవంతా ఆటం దగ్గరే వస్తుంది. నెలల ప్రకారం చూస్తే మన
ఈ అమెరికా వాళ్ళది ఎడ్డెమంటే తెడ్డెమనే వ్యవహారం కాబట్టి ఇంగ్లీషువాళ్ళు "ఆటం" అని పెట్టుకున్న పేరుని కాదని వీళ్ళు సొంత బుర్రతో ఆలోచించి దీనికి "ఫాల్" (fall) అని నామకరణం చేశారు .. ఎందుకంటే ఆకులు రాలతాయి కాబట్టి! సంవత్సరానికి మొదలు కాదు. ఋతువుల్లోనూ మొదటిది కాదు. కానీ బడులూ విశ్వవిద్యాలయాలూ ఫాల్ సెమిస్టరుతోనే ప్రారంభమవుతాయి. అనేక కళాసంస్థల ప్రదర్శన సీజను ఫాల్‌తోనే మొదలవుతుంది.
అట్లా రంగు మారటం మొదలు పెట్టిన ఆకులు నాలుగైదు వారాల పాటు వర్ణార్ణవ తరంగాలవుతాయి. తమాషా చెయ్యటానికి అన్నట్టు సృష్టికర్త ఒక కుంచె పట్టుకుని కొద్ది సేపు మోనే వేషం వేసుకుంటాడు. నేనేం తక్కువ తిన్నానా అని సర్వసాక్షి పడమటి నింగిపై సిందూరం చల్లుతుంటాడు. ప్రకృతి మొత్తం ప్రదర్శనకి సిద్ధమౌతున్న మహానటిలా అలంకారం చేసుకుంటూ ఉంటుంది. ఆ అలంకారమే అసలు ప్రదర్శన అని మనం గ్రహించే లోపలే ఒక అద్భుతమైన రంగులవల మనమీద పరుచుకుని సమ్మోహితుల్ని చేసేస్తుంది.చూస్తూ చూస్తూ ఉండగానే .. ప్రదర్శన ముగిసిపోతుంది. రంగుల ప్రపంచం మీద ఒక తెల్లటి మంచు తెర కప్పబడుతుంది.
దాని అందాలు .. మరోమాటు .. సందర్భోచితంగా ..
***********************
(వివాల్డి వికీ పేజీ చివర ఫోర్ సీజన్స్ సంగీతపు తునకలు ఉన్నాయి వినవచ్చు.)
పూర్తిగా చదవండి